Ekadashi fasting rules: ఏకాదశి ఉపవాసం ఉంటున్నారా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలో తెలుసుకోండి
Ekadashi fasting rules: ఏకాదశి ఉపవాసం మూడు రోజులు ఉండాలని పండితులు సూచిస్తున్నారు. కేవలం ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం ఉంటే వ్రత ఫలితం దక్కదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉపవాసం ఉండాలో తెలుసుకోండి.
Ekadashi fasting rules: సనాతన ధర్మంలో ఏకాదశి ఉపవాసానికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఒక నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి. ఎవరైనా సంవత్సరంలో 11 ఏకాదశుల నాడు ఉపవాసం ఉంటే స్వర్గప్రాప్తి కలుగుతుందని చెబుతారు. అయితే దీనికి ముందు మీరు ఏకాదశి ఉపవాస నియమాలను బాగా తెలుసుకోవాలి.

ఏకాదశి ఉపవాసం ఆచరించిన వ్యక్తి మరణానంతరం మోక్షం పొందుతాడని అంటారు. చేసిన పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు. విష్ణుమూర్తి అనుగ్రహం పొంది వైకుంఠ ప్రాప్తి పొందాలంటే ఏకాదశి ఉపవాసం నిష్టగా ఆచరించాలి. అయితే ఏకాదశి ఉపవాసం ఆచరించడం అంటే ఆ ఒక్కరోజు ఉండటం కాదు.
ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల ఉపవాసం పూర్తవుతుందని మీరు అనుకుంటే అది తప్పు. ఏకాదశి వ్రతంలో దశమి, ద్వాదశి తిథి కూడా పరిగణించబడుతుంది. ఈ రోజున కూడా ఉపవాస నియమాలు పాటిస్తారు. అప్పుడే ఏకాదశి వ్రతం పాటించాలి. మీరు మీ పాప కర్మలను ముగించాలనుకుంటే ఖచ్చితంగా ఏకాదశి ఉపవాసం పాటించండి. వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఆమె అదృష్టం చెక్కుచెదరకుండా ఉంటుందని చెబుతారు. ఈ ఉపవాస సమయంలో అబద్ధాలు చెప్పకుండా లేదా కోపం తెచ్చుకోకుండా ప్రయత్నించండి. అంతే కాకుండా ఈ వ్రతంలో అన్నం తినకూడదు. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉపవాసం విరమించిన అనంతరం అన్నం తినవచ్చు.
దశమి నుండి ఉపవాసం ప్రారంభం
ఏకాదశి ఉపవాసం ఆచరించాలని అనుకున్న వాళ్ళు దశమి తిథి నిష్టగా ఉండాలి. ముందు రోజు దశమి తిథి సాయంత్రం మీ ఉపవాసాన్ని భంగపరిచే విధమైన పదార్థాలు ఏదీ తినకండి. ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయ అసలు తినకూడదు. ఇవి తామసిక ఆహార జాబితాలోకి వస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఉపవాస నియమాలకు భంగం వాటిల్లుతుంది.
దశమి, ఏకాదశి, ద్వాదశి నాడు మూడు రోజులు సంయమనం పాటిస్తూ ఉపవాసం ఆచరించాలి. మూడు రోజుల పాటు కంచు పాత్రలో ఏమీ తినకూడదు. అంతే కాకుండా దశమి రోజున శనగపప్పు, పప్పు, ఆకుకూరలు వంటి వాటిని తినకూడదు.
ఏకాదశి రోజున కొంతమంది కటిక ఉపవాసం ఆచరిస్తారు. అలా ఉండలేని వాళ్ళు రోజులో ఒక్కసారైనా పండ్లు తినండి. ఉపవాసం అంటే పేరుకు ఉండటం కాదు. మనసు మొత్తం దేవుడి మీద లగ్నం చేయాలి. ఫోన్లు, టీవీలు చూస్తూ వినోదంగా ఉండకూడదు. ఈ రోజున ఏ చెట్టు నుండి ఆకు తీయకూడదు. ముఖ్యంగా ఏకాదశి ఉపవాసం రోజు తులసి ఆకులు తెంపకూడదు. నిత్యం భగవంతుడిని ధ్యానించండి. రాత్రి జాగరణ చేయండి.
మద్యం, మాంసాహారం, పొగాకు వంటివి తీసుకోకూడదు. కోపంతో పళ్ళు నమలకూడదు. ఇతరులను విమర్శించకూడదు, దుర్భాషలాడకూడదు. ఎవరినీ తమ ప్రవర్తనతో నొప్పించకూడదు. వీలైనంత వరకు శక్తి మేరకు దాన ధర్మాలు చేసేందుకు ప్రయత్నించాలి. ఏకాదశి రోజున ఒక్కసారైనా పండ్లు తినాలి. అలాంటప్పుడు మళ్లీ ద్వాదశి రోజున ఇత్తడి పాత్రల్లో ఆహారం తినకూడదు. నూనె పదార్థాలు తినకూడదు. ఓపికగా ఉంటూ ద్వాదశి రోజు బ్రాహ్మణులను ఇంటికి పిలిచి ఆహారం పెట్టి, దక్షిణ తాంబూలాదులు సమర్పించిన తర్వాత ఉపవాసం విరమించవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు చేసే ఏకాదశి ఉపవాస వ్రత ఫలితం పూర్తిగా దక్కుతుంది. విష్ణు అనుగ్రహం లభిస్తుంది.