Wedding Theme Ideas : ట్రెండీ వెడ్డింగ్ థీమ్​లు ఇవే.. మీరు ఓ లుక్కేయండి..-five interesting indian wedding theme ideas and decoration ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wedding Theme Ideas : ట్రెండీ వెడ్డింగ్ థీమ్​లు ఇవే.. మీరు ఓ లుక్కేయండి..

Wedding Theme Ideas : ట్రెండీ వెడ్డింగ్ థీమ్​లు ఇవే.. మీరు ఓ లుక్కేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 23, 2022 02:30 PM IST

Wedding Theme Ideas : ఈ మధ్యకాలంలో థీమ్ వెడ్డింగ్​లు మస్త్ ట్రెండ్ అవుతున్నాయి. వధూవరులు తమ పెళ్లిని గ్రాండ్​గా చేసుకునేందుకు.. తమ టేస్ట్​, ధోరణికి తగ్గట్లు వెడ్డింగ్​ థీమ్​ను డిజైన్ చేసుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి ట్రెండ్​ ఫాలో అవ్వాలనుకుంటే.. ఇక్కడ కొన్ని థీమ్ ఉదహారణలున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.

థీమ్ వెడ్డింగ్‌
థీమ్ వెడ్డింగ్‌

Wedding Theme Ideas : ఈ రోజుల్లో థీమ్ వెడ్డింగ్‌లు విపరీతమైన ట్రెండ్. ఎందుకంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి పెద్ద ఈవెంట్. కాబట్టి అందరూ తమ వెడ్డింగ్ మంచి జరగాలని.. వారు అనుకున్న విధంగా చేసుకోవాలని అనుకుంటారు. వారి వారి వ్యక్తిగత అభిరుచి, ప్రాధాన్యతలను ప్రతిబింబించేలా చూసుకుంటారు.

డెకార్ నుంచి దుస్తులు, వేదిక వరకు ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. అది రాయల్ వెడ్డింగ్ థీమ్ అయినా.. ఫెయిరీ టేల్ థీమ్ అయినా లేదా స్థిరమైనది అయినా.. ఎలా ఎంచుకోవాలో.. ఆసక్తికరమైన వెడ్డింగ్ థీమ్​లు ఎలా ఉండాలో.. ఎలా ఎంచుకుంటే బాగుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫెయిరీ టేల్ థీమ్

ఫెయిరీ టేల్-నేపథ్య వివాహం చేసుకోవాలి అనుకుంటే.. వేదిక కోసం బహిరంగ ప్రదేశాన్ని ఎంచుకోండి. దానిని స్టార్ లైట్లు, గ్రాండ్ షాన్డిలియర్లు, ఫాంటసీ ప్రపంచాన్ని పోలి ఉండే పూలతో డెకరేట్ చేసుకోవచ్చు.

హంసలు ఈత కొట్టే కృత్రిమ సరస్సును బిల్డ్ చేసుకోండి. పాస్టెల్ కలర్ థీమ్ ఎంచుకోండి. డెకర్‌లో తెలుపు, గులాబీ లేదా పీచు రంగులు ఉండేలా చూసుకోండి. వధువు పాస్టెల్ కలర్ లెహంగాను ఎంచుకోవచ్చు. వరుడు లేత గోధుమరంగు రంగులో ఉండే షేర్వానీని తమ ఔట్​ఫిట్​గా ఎంచుకోవచ్చు.

రాయల్ రాజ్‌పుత్ థీమ్

వేదిక కోసం వారసత్వ రాజ ఆస్తిని బుక్ చేయండి. వేదిక ప్రాంతాన్ని షీల్డ్‌లు, డమ్మీ కత్తులు, జావెలిన్‌లతో అలంకరించండి. మండప అలంకరణలో శక్తివంతమైన రంగులు, కర్టెన్లను ఉపయోగించండి. లైవ్ రాజస్థానీ జానపద నృత్యకారులతో పాటు లైవ్ నగాడా లేదా షెహనాయ్ ప్లేయర్‌లను బుక్ చేసుకోండి.

వివాహ నగల కోసం.. రాజస్థానీ కంగన్, కడ, కుందన్ చోకర్ నెక్లెస్, బోర్లా లేదా కుందన్ బుట్టి ధరించండి. మెనూకు సాంప్రదాయ రాజస్థానీ ఆహారాన్ని జోడించండి.

ఓల్డ్ స్టైల్ వివాహ థీమ్

మీరు మీ వివాహ వేడుకలకు పాత ప్రపంచ శోభను తీసుకురావలనుకుంటే.. పాతకాలపు వివాహ థీమ్ మీకు పర్​ఫెక్ట్​గా ఉంటుంది. పాత భవనాన్ని బుక్ చేసి.. పురాతన వస్తువులు, మ్యూట్-రంగు అలంకరణలతో అలంకరించండి.

వధువు పురాతన నగలు ధరించి పల్లకిలో మండపానికి చేరుకోవచ్చు. వరుడు క్లాసిక్ పాతకాలపు కారులో రావొచ్చు. మెటల్ ప్లేట్లలో ఆహారాన్ని వడ్డించవచ్చు.

గ్రీన్ వెడ్డింగ్ థీమ్

చుట్టూ చెట్లు, సరస్సులు లేదా ఎక్కడైనా సహజంగా ఉండే పర్యావరణ అనుకూలత ఉండే ప్రదేశాలను బుక్ చేసుకోండి. కొబ్బరి చిప్పలు, మట్టి దీపాలు, కొవ్వొత్తులు, గాజు రిఫ్లెక్టర్లు, నూనె లాంతర్లతో ఆ ప్రదేశాన్ని అలంకరించండి.

వధువు, వరుడు స్థిరమైన మెటీరియల్‌తో చేసిన వివాహ దుస్తులను ఎంచుకోవచ్చు. ఉక్కు, కలప లేదా సిరామిక్ వంటి పర్యావరణ అనుకూల కత్తిపీటలను ఉపయోగించండి. అతిథులకు రిటర్న్ గిఫ్ట్‌లుగా మొక్కలు లేదా కుండలను ఇవ్వొచ్చు.

ట్రైబల్ వెడ్డింగ్ థీమ్

మీరు ఆదివాసీ పద్ధతిలో వివాహం చేసుకోవాలనుకుంటే.. పర్వతాలలో లేదా పొదలు, పెద్ద చెట్లతో ఉన్న నది పక్కన జంగిల్ రిసార్ట్‌ను బుక్ చేసుకోవచ్చు.

మీ సంగీత్, కాక్‌టెయిల్ పార్టీల కోసం భోగి మంటలను ఏర్పాటు చేయండి. ఆదివాసీ నృత్యకారులచే ప్రత్యక్ష నృత్య ప్రదర్శన చేయించుకోవచ్చు. జంట తమ పెళ్లి దుస్తులను ఆకుపచ్చ లేదా ఆలివ్ వంటి రంగులను ఎంచుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం