Hansika Motwani unseen wedding photo: హన్సిక, సోహైల్ వెడ్డింగ్‌లోని ఈ ఫొటో చూశారా?
Hansika Motwani unseen wedding photo: హన్సిక, సోహైల్ వెడ్డింగ్ ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోల్లో కనిపించని ఓ ఫొటోను ఇప్పుడు సోహైల్ షేర్ చేశాడు.
Hansika Motwani unseen wedding photo: టాలీవుడ్, బాలీవుడ్ నటి హన్సికా మోత్వానీ పెళ్లి గురించి ఎన్నో రోజులుగా చర్చ జరిగింది. ఆమెను చేసుకోబోయే వ్యక్తి ఎవరు? పెళ్లి ఎక్కడ జరుగుతోంది? ఎంత ఖర్చవుతోంది? ఆ పెళ్లిని స్ట్రీమింగ్ చేస్తున్న ఓటీటీ ఏది? అంటూ రోజుకో వార్త వచ్చింది. ఇప్పుడు ఆమె పెళ్లి జరిగిపోయింది.
ఇప్పటికే పెళ్లి ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫొటోల్లో లేని ఓ రొమాంటిక్ ఫొటోను తాజాగా హన్సిక భర్త సోహైల్ పోస్ట్ చేశాడు. డిసెంబర్ 4న హన్సిక వ్యాపారవేత్త అయిన సోహైల్ కథూరియాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జైపూర్‌లోని ముండోతా ఫోర్ట్‌లో వీళ్ల పెళ్లి జరిగింది. హన్సికతో ఉన్న ఆ ఫొటోను షేర్ చేస్తూ సోహైల్.. ఆమె కోసం ఓ మనసుకు హత్తుకునే మెసేజ్ పోస్ట్ చేశాడు.
"మా ఇద్దరి మనసులు ఒక్కటే. ఇక నాతోపాటు జీవించు. జీవితంలో అత్యుత్తమ క్షణాలు ఇప్పుడు రాబోతున్నాయి. ఒకవేళ నువ్వు వందేళ్లు జీవించాలనుకుంటే.. నేను అంతకంటే ఒక రోజు తక్కువగా జీవించాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు లేకుండా జీవించాల్సిన రోజు నాకు రాదు. నిజమైన ప్రేమ ఎప్పుడూ గుడ్డిది కాదు. నిజానికి జీవితానికి ఓ వెలుగును ఇస్తుంది" అని సోహైల్ అన్నాడు.
అంతకుముందు హన్సిక కూడా తమ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది. జైపూర్‌లో పెళ్లి పనులు ముగించుకొని ఆమె మంగళవారం (డిసెంబర్ 6) తిరిగి ముంబై చేరుకుంది. భర్త సోహైల్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఆమె కెమెరాలకు పోజులిచ్చింది. పింక్ శారీలో ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతూ హన్సిక కనిపించింది.