Niharika and Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు కన్ఫార్మా? భర్త ఫొటోలను డిలీట్ చేసిన మెగా డాటర్-niharika konidela deletes chaitanya jonnalagadda and unfollow him in instagram ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Niharika And Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు కన్ఫార్మా? భర్త ఫొటోలను డిలీట్ చేసిన మెగా డాటర్

Niharika and Chaitanya Divorce: నిహారిక-చైతన్య విడాకులు కన్ఫార్మా? భర్త ఫొటోలను డిలీట్ చేసిన మెగా డాటర్

Maragani Govardhan HT Telugu
Apr 12, 2023 08:17 AM IST

Niharika and Chaitanya Divorce: మెగా డాటర్ నిహారిక కొణిదెల తన భర్త చైతన్య జొన్నలగడ్డతో విడిపోనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ వర్గాలు. ఇన్‌స్టాలో చైతన్యకు సంబంధించిన ఫొటోలను డిలీట్ చేసిన నిహారిక.. అతడిని అన్ ఫాలో కూడా చేసింది.

నిహారిక-చైతన్య
నిహారిక-చైతన్య

Niharika and Chaitanya Divorce: నిహారిక కొణిదెల- చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవలై చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి నిహారికాకు సంబంధించిన పోస్టులను, రీల్స్‌ను తొలగించాడు. అలాగే ఆమెను అన్ ఫాలో కొట్టేశాడు. ఇప్పుడు నిహారిక వంతైంది. తాజాగా ఆమె చైతన్యకు సంబంధించిన ఫొటోలను పోస్టులను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. అంతేకాకుండా అతడిని అన్ ఫాలో చేసింది.

ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం గత కొన్నిరోజులుగా చైతన్య-నిహారిక మధ్య విభేదాలు తలెత్తున్నట్లు తెలుస్తున్నాయి. దీంతో ఇరువురు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. రెండేళ్లలోనే వీరి పెళ్లి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనను వీరు విడుదల చేయలేదు.

ఇద్దరి మధ్య సమస్యలు తీవ్రమవడంతో గత కొన్నిరోజులుగా వేర్వేరుగా ఉంటున్నారట. అయితే వీరి మధ్య సమస్యల గల కచ్చితమైన కారణమైతే తెలియదు. కానీ వీరి బంధం మాత్రం విడాకుల వైపు వెళ్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే న్యాయపరమైన పనులు కూడా ప్రారంభమయ్యాయట.

తాజాగా నిహారిక హైద‌రాబాద్‌లో త‌న ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కొత్త ఆఫీస్‌ను ఓపెన్ చేసింది. ఇటీవల ఈ ఆఫీస్ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను నిహారిక సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో నిహారిక‌ భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో పాటు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎవ‌రూ క‌నిపించ‌లేదు. సోలోగా నిహారిక అన్ని ప‌నులు చ‌క్క‌బెడుతూ క‌నిపించింది.

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తేగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక.. యాంకర్‌గా, హీరోయిన్‌గా, నిర్మాతగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. 2020 డిసెంబరులో టెక్ అఫిషియల్ చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది. ఉదయ్‌పుర్ వేదికగా జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌ వైభవంగా జరిగింది. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన వీరి వివాం బంధం రెండేళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది.

Whats_app_banner