Niharika Konidela New Office: కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక - వేడుక‌లో క‌నిపించ‌ని భ‌ర్త చైత‌న్య‌-niharika konidela started new production office photos viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Niharika Konidela New Office: కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక - వేడుక‌లో క‌నిపించ‌ని భ‌ర్త చైత‌న్య‌

Niharika Konidela New Office: కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన నిహారిక - వేడుక‌లో క‌నిపించ‌ని భ‌ర్త చైత‌న్య‌

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 07:19 AM IST

Niharika Konidela New Office: సినిమాల‌కు దూరంగా ఉంటోన్న మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల వెబ్‌సిరీస్ ప్రొడ‌క్ష‌న్స్‌పై దృష్టిసారిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌న నిర్మాణ సంస్థ‌కు సంబంధించి కొత్త ఆఫీస్‌ను ప్రారంభించింది నిహారిక‌.

నిహారిక కొణిదెల
నిహారిక కొణిదెల

Niharika Konidela New Office: భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ నుంచి మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల విడిపోనున్న‌ట్లు గ‌త కొంత కాలంగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు విడాకులు తీసుకోనున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఈ పుకార్ల‌పై ఇప్ప‌టివ‌ర‌కు నిహారిక‌తో పాటు మెగా ఫ్యామిలీ పెద‌వి విప్ప‌లేదు. మ‌రోవైపు ఈ విడాకుల పుకార్ల‌తో సంబంధం లేకుండా యాక్టింగ్‌, ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో నిహారిక బిజీగా ఉంది.

తాజాగా ఆమె హైద‌రాబాద్‌లో త‌న ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌కు సంబంధించి కొత్త ఆఫీస్‌ను ఓపెన్ చేసింది. సోమ‌వారం ఈ ఆఫీస్ పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను నిహారిక సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో నిహారిక‌ భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో పాటు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ ఎవ‌రూ క‌నిపించ‌లేదు. సోలోగా నిహారిక అన్ని ప‌నులు చ‌క్క‌బెడుతూ క‌నిపించింది. ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఈ వేడుక‌లో నిహారిక భ‌ర్త చైన‌త్య క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌రోసారి విడాకుల ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. నిహారిక‌కు చైత‌న్య దూరంగా ఉటున్న‌ట్లు, అందుకే అత‌డు ఈ వేడుక‌కు హాజ‌రుకాలేద‌ని చెబుతోన్నారు. కాగా త‌న కొత్త ఆఫీస్‌కు పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ అనే పేరును పెట్టింది నిహారిక‌.

ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటోన్న వెబ్‌సిరీస్ ప్రొడ‌క్ష‌న్స్‌తో బిజీగా ఉంది. అలాగే డెడ్‌ పిక్సెల్స్ అనే వెబ్‌సిరీస్‌లోనూ న‌టించింది. త్వ‌ర‌లోనే డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

IPL_Entry_Point