తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Scalp Folliculitis: తలపై గడ్డలు, దురదా? స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ లక్షణాలు అవే

Scalp folliculitis: తలపై గడ్డలు, దురదా? స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ లక్షణాలు అవే

HT Telugu Desk HT Telugu

29 March 2023, 17:26 IST

  • Scalp folliculitis: స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ అంటే తెలుసా? మీ తలపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

తలపై గడ్డలు, దురద ఉందా
తలపై గడ్డలు, దురద ఉందా (freepik )

తలపై గడ్డలు, దురద ఉందా

మీ తలపై ఇబ్బందికరమైన గడ్డలు, దురదతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారా? పరిష్కారం లేక అలసిపోయారా? అయితే మీరు స్కాల్ప్ ఫోలిక్యులిటిస్‌తో బాధపడుతూ ఉండవచ్చు. ఇది తలపై ఉండే వెంట్రుకల కుదుళ్లను ప్రభావితం చేసే అనారోగ్యం ఇది. చిన్నచిన్న ఎరుపు రంగులో గడ్డలు కలిగి ఉండడం కనిపిస్తుంది. అవి చీముతో కూడా నిండి ఉండవచ్చు. ఇది అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇదేమీ తీవ్రమైన సమస్య కాదు. సరైన సంరక్షణ, మందులతో చికిత్స చేయవచ్చు. ఈ బాధించే గడ్డలకు వీడ్కోలు చెప్పాలనుకుంటే, స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే స్కాల్ప్ ఫోలిక్యులిటిస్ గురించి ఇక్కడ తెలుసుకోండి.

‘స్కాల్ప్ ఫోలిక్యులిటిస్ అనేది హెయిర్ ఫోలికల్ ఇన్ఫెక్షన్. ఇది రెండు రకాలుగా ఉంటుంది. స్టెరైల్ ఫోలిక్యులిటిస్, బాక్టీరియల్ ఫోలిక్యులిటిస్. స్టెరైల్ ఫోలిక్యులిటిస్‌లో హెయిర్ ఫోలికల్స్ ఇన్‌ఫెక్షన్ బారిన పడవు. కానీ ఇన్‌ఫ్లమేషన్ (మంట) కు గురవుతాయి. తలపై చర్మానికి (మాడు) కఠినంగా మసాజ్ చేయడమో లేదా మీరు రుద్దుతున్న నూనె.. మాడు రంధ్రాలను మూసివేయడం వల్లనో ఇలా జరుగుతుంది. ఇది నెత్తి మీద చర్మం, జుట్టు మూలాల్లో చికాకుకు దారితీస్తుంది. మరోవైపు ఫోలికల్స్‌లో ఉండే ఈస్ట్ కాలానుగుణ మార్పులు లేదా ఇతర కారకాలతో పాటు అదనపు నూనె స్రావాల కారణంగా తీవ్రత పెరుగుతుంది. అప్పుడు బాక్టీరియల్ ఫోలిక్యులిటిస్ విస్ఫోటనం చెందుతుంది..’ అని కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ రష్మీ శెట్టి చెప్పారు.

‘స్కాల్ప్ ఫోలిక్యులిటిస్ చికిత్స కోసం వైద్య నిపుణుడిని సంప్రదించడం అత్యవసరం. తీవ్రతను బట్టి వారు కొన్ని జీవనశైలి మార్పులను సిఫార్సు చేస్తారు. తలపై సున్నితంగా మసాజ్ చేయాలని సూచించవచ్చు. మురికిగా ఉన్న తలపై మసాజ్ చేయవద్దని సూచించవచ్చు. మీ జుట్టును తరచుగా కడగాలని సూచించవచ్చు. డ్రై హెయిర్, ఆయిల్ స్కాల్ప్ కలయికతో ఉన్న వ్యక్తులు జుట్టును ఎక్కువసార్లు కడగరు. అలా చేయడం వల్ల జుట్టు మరింత పొడిబారుతుందనే భావనలో వారు ఉంటారు. కానీ ఇది మాడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటప్పుడు మీరు ఎలాంటి నూనెలు లేని క్లారిఫైయింగ్ షాంపూని ఉపయోగించవచ్చు. ఇది జుట్టును పొడిబారనివ్వదు..’ అని చెప్పారు.

‘ఇదికాకుండా, మరొక మార్గం ఏంటంటే సప్లిమెంట్లు అందించడం, లేదా యాంటీబయోటిక్స్ ఇవ్వడం. మెడపై ఉండే స్కాల్ప్ ఫాలిక్యులైటిస్ కొన్నిసార్లు చికిత్సకు లొంగదు. అందువల్ల అది నయం కావడానికి చాలా సమయం పట్టొచ్చు. అందుకే సెబాసియస్ గ్రంథి స్రావాన్ని తగ్గించేందుకు వీలుగా సప్లిమెంట్లు ఇస్తారు. మీరు మీ హార్మోన్ల స్థాయిని, రక్తంలో గ్లూకోజు స్తాయిని తరచూ చెక్ చేస్తూ ఉండాలి. విభిన్న అనారోగ్యాలు కూడా స్కాల్ప్ ఫాలిక్యులైటిస్‌కు కారణమవుతాయి..’ అని డాక్టర్ రష్మి వివరించారు.

టాపిక్