Itchy Scalp Remedies : తలపై దురదగా ఉందా? దురదకు ఇలా బై బై చెప్పేయండి-hair problems have itchy scalp try these 7 home remedies to relief from hair problem
Telugu News  /  Lifestyle  /  Hair Problems Have Itchy Scalp Try These 7 Home Remedies To Relief From Hair Problem
తలపై దురద
తలపై దురద

Itchy Scalp Remedies : తలపై దురదగా ఉందా? దురదకు ఇలా బై బై చెప్పేయండి

27 March 2023, 9:40 ISTHT Telugu Desk
27 March 2023, 9:40 IST

Itchy Scalp : కొంతమందికి తల మీద దురద ఎక్కువగా ఉంటుంది. దీనితో చిరాకు పుడుతుంది. చూసేవాళ్లకు కూడా బాగుండదు. అందుకే తలపై దురదను తగ్గించుకోండి. దానికోసం కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

తల మీద దురద పెట్టడం మీకు, మీ జుట్టు ఆరోగ్యానికి(Hair Health) ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా తల మీద డ్రైగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. తలపై దురదను నివారించడానికి ఏం చేయాలి? 7 సులభమైన ఇంటి నివారణలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి.. దురదకు బై బై చెప్పవచ్చు.

నిమ్మరసం

నిమ్మరసం(Lemon)లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీన్ని కాటన్ బాల్‌తో తలకు పట్టించి 10-15 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే ఉపశమనం కలుగుతుంది.

కొబ్బరి నూనె

కొన్నిసార్లు దురదకు కారణం చర్మం పొడిగా ఉంటుంది. కొబ్బరి నూనె(Coconut Oil) తలకు అద్భుతమైన మాయిశ్చరైజర్. దీన్ని వేడి చేసి తలపై మసాజ్ చేయాలి. వీలైనంత సేపు అలాగే ఉంచి తర్వాత షాంపూతో కడగాలి. అలాగే కొబ్బరినూనెలో కొద్దిగా కర్పూరం మిక్స్ చేసి తలకు మర్దన చేయాలి. కర్పూరం ప్రభావం చల్లగా ఉంటుంది, దీని వల్ల దురదలు తగ్గి, ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా నయమవుతుంది.

వంట సోడా

2-3 చెంచాల బేకింగ్ సోడా తీసుకుని నీటితో పేస్ట్ చేయాలి. దీన్ని తలకు పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బేకింగ్ సోడా ఒక యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ మరియు ఇది స్కాల్ప్ యొక్క pHని తగ్గిస్తుంది.

ఉల్లిపాయ రసం

ఒక ఉల్లిపాయను తీసుకుని దాని రసాన్ని తీయండి. దీన్ని కాటన్‌తో తలకు పట్టించి కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది, చికాకును తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

నాలుగు టీస్పూన్ల నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. యాపిల్‌లో ఉండే మాలిక్ యాసిడ్‌లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు దురదను తగ్గిస్తాయి.

బంతి పువ్వులు

బంతి పువ్వులు(marigold flower) యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తలపై దురద నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.

పెరుగు

పెరుగు(Curd)తో తలకు మసాజ్ చేయడం వల్ల దురద కూడా తగ్గుతుంది. దీంతో జుట్టుకు మెరుపు వస్తుంది. మురికి దురదకు కారణమవుతుంది కాబట్టి స్కాల్ప్ పరిశుభ్రత కూడా ముఖ్యం.

ఈ కాలంలో రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను జుట్టుకు ఎక్కువగా ఉపయోగించడం వలన జుట్టు సమస్యలు(Hair Problems) వస్తున్నాయి. హెయిర్ ప్రొడక్ట్స్‌లో ఉండే సల్ఫేట్‌లు జుట్టుకు కొన్ని ప్రయోజనాలు చేకూర్చినప్పటికీ, వీటి వల్ల జుట్టు పొడిబారి, త్వరగా పాడైపోయేలా చేస్తాయి. ఇది జుట్టును తెల్లగా మారుస్తుంది. అందువల్ల సల్ఫేట్ లేని జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎంచుకోండి.

దీర్ఘకాలం పాటు ఒత్తిడిని అనుభవిస్తే, అది నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించటం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ పరిస్థితులన్నీ మీ జుట్టుపై చెడుప్రభావం చూపిస్తాయి. ఫలితంగా జుట్టు రాలడం(Hair Loss) వంటి సమస్యలను ఎదుర్కొంటారు, క్రమక్రమంగా వెంట్రుకలు తెల్లబడటం(White Hair) ప్రారంభిస్తాయి. కాబట్టి మిమ్మల్ని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి రోజూ ధ్యానం చేయాలి. సరైన నిద్రపోవాలి.