తెలుగు న్యూస్ / ఫోటో /
CM Jagan at Tiruvuru: పేదరికం అడ్డుకాకూడదు.. తలరాతను మార్చే శక్తి చదువుకే ఉంది - సీఎం జగన్
- Jagananna Vidya Deevena Funds Release: జగనన్న విద్యా దీవెన కింద గత ఏడాది (2022) అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోలో ఏర్పాటు చేసిన సభలో... బటన్ నొక్కి నేరుగా 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.698.68 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు.

(1 / 6)
తిరువూరు వాహినీ కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం జగన్ హెలికాప్టర్ దిగింది. అక్కడ్నుంచి బస్సు మార్గంలో సభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఘనస్వాగతం పలికారు.(twitter)
(2 / 6)
సభా ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (twitter)
(3 / 6)
ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్...పేదలు బాగుండాలనే నవరత్నాలు ప్రవేశపెట్టామని చెప్పారు. పేద కుటుంబాల తలరాతే మార్చేది విద్య మాత్రమే అని అన్నారు. పిల్లలకు ఇచ్చే అత్యంత విలువైన ఆస్తి కూడా చదువే అని వ్యాఖ్యానించారు.
(4 / 6)
చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నారు ముఖ్యమంత్రి జగన్. దేశంలో విద్యాదీవన, వసతి దీవెన పథకాలు ఎక్కడా లేవని చెప్పారు. కాలేజీ ఫీజులు ఎంతైనా సరే పూర్తి బాధ్యత తమ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. లంచాలు, వివక్ష లేకుండా తల్లుల ఖాతాల్లో విద్యాదీవెన నిధులు జమ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.(twitter)
(5 / 6)
జగనన్న విద్యాదీవెన ద్వారా ఇప్పటివరకు రూ.9,947 కోట్లు ఇచ్చామని ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. 27 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. చంద్రబాబు హయాంలోని బకాయిలను కూడా చెల్లించామని స్పష్టం చేశారు. (twitter)
ఇతర గ్యాలరీలు