తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Quote : ప్రేమ ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది..

Wednesday Quote : ప్రేమ ఎన్నో తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది..

15 June 2022, 8:00 IST

    • ప్రపంచంలో అన్నింటి కన్నా గొప్పది ప్రేమే అంటారు చాలామంది. ఈ ప్రేమ ఏ సంబంధాన్ని అయినా బలోపేతం చేస్తుంది. ఒకరినొకరికి దగ్గర చేస్తుంది. ఇతరుల నుంచి విడదీయలేని బంధాన్ని ఏర్పరుస్తుంది. ఒక్కోసారి వారి తప్పులను కూడా క్షమించేలా చేస్తుంది.
ప్రేమ
ప్రేమ

ప్రేమ

Wednesday Quote : ఎదుటివారి తప్పులను క్షమించగలిగే గుణం అందరికీ ఉండదు. కొందరు మంచి హృదయంతో ఎదుటివారి తప్పులను క్షమిస్తారు. కానీ మనల్ని ప్రేమించేవారు మన తప్పులను కూడా క్షమిస్తారు. ముందు మనల్ని తిట్టినా.. మనం ఆ తప్పు ఎందుకు చేశామా అని ఆలోచిస్తారు. మన పరిస్థితులను అర్థం చేసుకుని మనకి సపోర్ట్ చేస్తారు. మన తప్పులను ఇతరులు వేలు ఎత్తి చూపించినప్పుడు వారే మనకి బదులుగా రిప్లై ఇస్తారు.

ఇలా మన తప్పులను సమర్థిస్తున్నారని మనం ఇంకా తప్పులు చేసుకుంటూ ఉంటే మాత్రం అది అస్సలు మంచిది కాదు. వారు మనం చేసిన ఎన్నో తప్పులను భరించి ఉండవచ్చు కానీ.. వారి ప్రేమను మిస్ యూజ్ చేసుకోకూడదు. వారి ప్రేమ మిమ్మల్ని ఏదొక రోజు కచ్చితంగా మారుస్తుంది. వారు మిమ్మల్ని క్షమిస్తున్నారు కాబట్టి.. మీరు ఏమి చేసినా గ్రాంటెడ్​గా ఉంటుందని అనుకోకూడదు. వారికోసం.. వారు మీపై ఉంచిన నమ్మకం కోసం.. మీకు వారు స్టాండ్ తీసుకున్న విధానం కోసం అయినా మీలో కచ్చితంగా మార్పురావాలి. ప్రేమ ఎప్పుడూ తప్పులను ఎంక్రేజ్ చేయదు. తప్పు చేసిన వారిని క్షమిస్తుందేమో కానీ.. తప్పులను మాత్రం ఎప్పటికీ క్షమించదు.