తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation | ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి.. ఎవరు ఇచ్చినా కాదనకండి..

Wednesday Motivation | ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి.. ఎవరు ఇచ్చినా కాదనకండి..

HT Telugu Desk HT Telugu

01 June 2022, 7:36 IST

    • ప్రేమకు ఎన్నో రూపాలు ఉన్నాయి. అవి అనంతమైనవి. కానీ దానిని ఎప్పుడూ ఒంటరిగా కనుగొనలేము. నిజమైన ప్రేమను ఇతరుల ద్వారానే కనుగొంటాము. అది ఒకరితోనే మొదలవ్వదు. ఒకరితోనే ఆగిపోదు.
ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి
ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి

ప్రేమ అనేది ఓ గొప్ప అనుభూతి

Wednesday Quote | మనకి ఒంటరిగా ఉండడం ఎంత ఇష్టమైనా... ప్రేమను కనుగొనాలంటే మాత్రం ఇతరులు కావాల్సిందే. మనకు సాధారణంగా లేదా నిర్దిష్టంగా.. ఆదర్శంగా ఉన్నవారితో మనం కలిసిపోతాము. ఆ సమయంలో ప్రేమ చిగురించే అవకాశముంది. సెల్ఫ్​ లవ్​ ప్రతిఒక్కరిలో ఉండాలి. కానీ ఇతరుల నుంచి కలిగే ప్రేమకు ఇది పూర్తిగా భిన్నం.

ట్రెండింగ్ వార్తలు

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

దీని అర్థం మీ కోసం సరైన వ్యక్తిని వెతుక్కోమని అర్థం కాదు. రకరకాల ప్రేమలను.. ఇతరుల నుంచి ఎలా పొందుతున్నారనేది అర్థం. వయసుతో, జాతితో సంబంధం లేకుండా.. కొన్ని ప్రదేశాలలో ఆ అనుభూతిని మనం పొందుతాం. ప్రేమ రూపాలు అనంతమైనవి. కాబట్టి మిమ్మల్ని కోరుకోని ప్రేమ కూడా ఉంటుంది. జస్ట్ దూరంగా ఉంటూ మీరు మంచిగా ఉండాలని భావించేది కూడా ఓ రకమైన ప్రేమే. అది మీకు అర్థమైన రోజు మీ జీవితంలో వారి పట్ల మంచి భావం కలుగుతుంది. ఈ ప్రేమలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కుటుంబ ప్రేమ. దీనిలో రక్త సంబంధంతో కూడిన ప్రేమలు ఉంటాయి. శృంగార సంబంధమైన ప్రేమ ఉంటుంది.

ప్రేమ అనేది ఒక ఆదర్శ కుటుంబం నుంచి లేదా.. అపరిచితుల నుంచి.. లేదా మీరు లేకుండా జీవించలేని వ్యక్తి గురించి.. లోతైన స్థాయిలలో వచ్చే ఓ గొప్ప అనుభూతి. కానీ మీ జీవితంలో ఈ ప్రేమను పొందకుంటే.. జీవితం బంజరులా అనిపిస్తుంది. మీ జీవితంలో ఎన్ని రకాల ప్రేమలు ఉన్నాయో.. వాటి పేర్లు ఏమిటో చెప్పగలరా? అయితే మీరు ఎవరినుంచి ప్రేమను పొందుతున్నారో తెలుసుకోండి. వారికోసం కుదిరినప్పుడు మీ సమయాన్ని.. పరిస్థితులకు అనుగుణంగా వెచ్చించండి. ప్రేమ అనేది గొప్ప అనుభూతి. మీరు చేసే పనిని ఎందుకు చేస్తున్నారో.. గుర్తించుకోవడంలో అది మీకు సహాయం చేస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం