తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Love Horoscope : మీరు భవిష్యత్తును చూడలేకపోవచ్చు కానీ.. సమయం గడిచేకొద్దీ..

Love Horoscope : మీరు భవిష్యత్తును చూడలేకపోవచ్చు కానీ.. సమయం గడిచేకొద్దీ..

14 June 2022, 6:51 IST

    • ప్రతి ఒక్కరికి లైఫ్​లో ప్రేమ ముఖ్యమైనది. ప్రేమ జీవితం సరిగా ఉంటే.. అన్ని విషయాలలో విజయం సాధించవచ్చు. మరి మీ విషయంలో ప్రేమ కాంప్లికేటడ్​గా ఉందా? మీ భాగస్వామితో సంబంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అనుకుంటున్నారా? అయితే రాశుల ప్రకారం మీ ప్రేమలో ఎలాంటి ట్విస్ట్​లు ఉన్నాయో తెలుసుకుని.. ముందుకు వెళ్లిపోండి. చంద్రమానం అనుసరించి రాశిఫలాలుగా గమనించగలరు.
రాశుల ఫలితాలు
రాశుల ఫలితాలు

రాశుల ఫలితాలు

మేషం: మీరు మీ సంబంధంలో మీ అభిరుచిని కొనసాగించగలరని మీరు నమ్ముతున్నారు. మీ భాగస్వామి కూడా మీ కంపెనీలో ఆనందించే అవకాశం ఉంది. సంబంధాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలకు దూరంగా ఉండాలి. గొడవలకు బదులుగా వారిని మరింత క్షమించాలి. ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంచితే.. మీ బంధం మరింత పెరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

వృషభం: ప్రేమ ఆశను కోరుతుంది. కాబట్టి.. మీ సంబంధం నిరుత్సాహంగా ఉన్నప్పుడు.. త్వరలోనే మీకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని నమ్మకం ఉంచండి. ప్రస్తుతం మీరు భవిష్యత్తును చూడలేకపోవచ్చు. కానీ సమయం గడిచేకొద్దీ.. అద్భుతమైన శృంగార జీవితాన్ని గడుపుతారు.

మిథునం: మీ ఉద్యోగ జీవితం గతంలోని మీ శృంగార జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని గురించి చింతించకండి. మీ ప్రేమ జీవితానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ భాగస్వామి కోసం కాస్త సమయాన్ని వెచ్చించండి.

కర్కాటకం: మీరు మీ నిర్ణయాల విషయంలో దృఢంగా ఉండాలి. ఎవరైనా మీ జీవితంలోకి మళ్లీ రావడానికి ప్రయత్నించి.. మీకు కొంత గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీరు ఇటీవల కొత్త సంబంధాన్ని ప్రారంభించి ఉంటే.. వారు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమయంలో మీరు ఆందోళనతో వ్యవహరించడం సరికాదు. స్పష్టంగా ఆలోచించి.. నిర్ణయాలు తీసుకోండి.

సింహం: మీకు నిజంగా ఏదైనా కావాలనుకుంటే.. దాన్ని పొందడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది. మీ శృంగార సంబంధాలు ఈరోజు సరైన మార్గంలో అవసరమైన పుష్‌ను పొందుతాయి. సంభాషణలు, కొత్త వ్యక్తుల గురించి తెలుసుకోవడం వంటివి మీ రోజు గడపడానికి అద్భుతమైన మార్గాలు. కొంతకాలంగా సాగుతున్న స్నేహం చిగురించి.. రొమాన్స్‌కి నాంది పలుకుతోంది.

కన్య: ఈ రోజు మీ ప్రేమ జీవితంలో కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ఇది మీకు, మీ ముఖ్యమైన వారికి చాలా సరదాగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లకు గొప్ప సమాధానాలను పొందడానికి ఇదే సరైన సమయం. సమస్యల గురించి లోతైన సంభాషణలు చేయండి కానీ.. సమాధానాల కోసం ఎక్కువగా చింతించకండి.

తుల: మీరు మీకు సంబంధించినవి పంచుకోవడానికి ఎక్కువ సమయం లేదా వనరులు లేనట్లు భావించినా ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడూ వెనుకాడరు. ఇతరుల గురించి మీరు శ్రద్ధ వహిస్తారు. అలా చేయడంలో మీరు పరిపూర్ణ ఎఫర్ట్స్ పెడతారు. ఇతరులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండే మీ మనస్తత్వం.. మిమ్మల్ని మీ ప్రేమకు మరింత దగ్గర చేస్తుంది. 

వృశ్చికం: మీరు ఒక వ్యక్తితో దీర్ఘకాలిక నిబద్ధత కోసం సిద్ధంగా ఉన్నారని మీరు విశ్వసిస్తున్నప్పటికీ.. మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారో ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి. ప్రేమతో ప్రయాణించే ముందు మీరు నిజంగా దానికి కట్టుబడి ఉన్నారో లేదో తేల్చుకోండి. మీ భాగస్వామి డిమాండ్లను మీరు భరించడానికి సిద్ధంగా ఉన్నారలో లేదో అనే విషయంపై స్పష్టత తెచ్చుకోండి. 

ధనుస్సు: ఎవరైనా మీ గురించి వారి భావాలను వ్యక్తం చేసే తీరు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాబట్టి ఈ స్నేహాన్ని పెంపొందించుకోవడానికి సమయం, కృషిని పెట్టుబడిగా పెట్టండి. మీరు వారిలో ఆసక్తికరమైన ఏదో విషయాన్ని కనుగొంటారు.

మకరం: మీరు మీ భాగస్వామి ప్రేమను పొందాలంటే.. ముందుగా వారి పట్ల మీకున్న ప్రేమను వారికి చూపించాలి. మీరు వారి ప్రేమను పొందడం కోసం కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు ఎలా అనిపిస్తుందో.. మీరు అలా నిజాయితీగా ఉంటే చాలు. మీతో, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ.. మీతో ఉంటే చాలా భద్రతగా, సౌకర్యంగా ఉన్నట్లు భావిస్తారు. 

కుంభం: మీరు, మీ ప్రియమైన వ్యక్తి మధ్య ఇటీవల సమస్యలు వస్తే.. వాటిని ఈరోజు పోగొట్టుకోవచ్చు. మీ సంబంధంలో మళ్లీ నిజమైన ఆప్యాయతను పునరుద్ధరించడానికి.. కలిసి సరదాగా ఏదైనా చేయడానికి సమయాన్ని వెచ్చించండి. అధునాతనంగా ఉండటానికి ప్రయత్నించవద్దు. మార్పు కోసం నిజాయితీగా ఉండండి.

మీనం: మీ ప్రస్తుత సంబంధంలో.. మీరు మరింత సమగ్రమైన విధానాన్ని ప్రయత్నించడానికి మీరు మొగ్గు చూపుతున్నారు. కానీ అది ఇతర అంశాలలో మిమ్మల్ని బాధపెడుతుందని మీరు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ విషయంపై మీరు నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండవచ్చు. కానీ విషయాలను మెరుగుపరచడానికి ఏదైనా కొత్తగా ప్రయత్నించడం వల్ల గణనీయమైన ప్రభావాలను చూస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం