తెలుగు న్యూస్  /  Lifestyle  /  Wednesday Motivation On Man Need Difficulties In Life Because They Are Necessary To Enjoy The Success

Wednesday Motivation : గెలుపు విలువ తెలియాలంటో ఒక్కసారి ఓడిపోయి చూడాలి..

21 September 2022, 6:36 IST

    • Wednesday Motivation : ప్రతి మనిషి జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉండాలని.. ఎందుకంటే అవి సక్సెస్​ని ఎంజాయ్ చేయడానికి సహాయం చేస్తాయని డాక్టర్ ఏపీజే అబ్దుల్​ కలాం గారు చెప్పారు. అవును నిజమే మరి. ఎప్పుడూ సక్సెస్ అయ్యేవాడికి దాని రుచి తెలియదు. ఓడిపోయిన వాడికి మాత్రమే గెలుపు రుచి ఏంటో తెలుస్తుంది. కాబట్టి దీని గురించి తెలియాలంటే.. దానిని దాటుకుని రావాల్సిందే.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : సాధారణంగా అందరూ సంతోషం, ఆనందమే తమ లైఫ్​లో కావాలి అనుకుంటారు. ఆనందంగా ఉన్న క్షణంలో.. జీవితం ఇలా సాగిపోతూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటాము. అయితే.. ఆనందం ఎక్కువసేపు ఉంటే.. మనం దానిని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే అప్పుటికే అది మనకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఎంతో కష్టపడితేనే కానీ ఇది వచ్చిందనే విషయాన్ని మరచిపోయి.. సక్సెస్​ని చాలా తేలికగా చూస్తాము. దానికి సరిగా విలువను ఇవ్వము.

అందుకే విజయం విలువ తెలియాలంటే కచ్చితంగా ఓడిపోవాలి. అప్పుడప్పుడు లైఫ్​లో కొన్ని ఇబ్బందులు రావాలి. అప్పుడే మన దగ్గర ఏమి ఉంది.. మనకు ఏమి దక్కింది.. మనకు ఏమి కావాలి అనే వాటిపై గౌరవం పెరుగుతుంది. మన దగ్గర ఉన్నవాటి విలువ పెరుగుతుంది. మనం ఏమి పొందాము అనే దానిపై స్పృహతో ఉండాలి. దానిపట్ల కృతజ్ఞతతో ఉండాలి. ఒకవేళ మన దగ్గర ఏదైనా ఎక్కువగా ఉంటే దానిని లేనివారికి దానం చేయాలి. ఇది మీరే కాకుండా.. మీతో ఉన్న వారు కూడా ఎదిగేందుకు సహాయం చేస్తుంది. అప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది. మీ దగ్గర ఎక్కువన్నది ఎదుటివారికి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా. కాబట్టి ఎదుటివారికి సహాయం చేయడానికి ఎప్పుడు వెనుకడుగు వేయకండి.

సులువుగా దక్కేస్తే దేనికైనా అంత విలువ ఉండదు. దానికోసం కష్టపడాలి. శారీరకంగా.. మానసికంగా దృఢంగా అవ్వాలి. ఈజీగా సక్సెస్​ అయితే ఎప్పుడూ కిక్ ఉండదు. కష్టాలు మనల్ని తాకినప్పుడు.. ఆ సమయంలో మనం నేర్చుకున్న పాఠాలను మళ్లీ అప్లై చేసి.. సక్సెస్ అయినప్పుడే దాని రుచి తెలుస్తుంది. విపత్తులు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తాయో చెప్పలేము. కాబట్టి ఎప్పుడూ మనం వాటికోసం సిద్ధంగా ఉండాలి.

ఓడిపోయినప్పుడే గెలుపు విలువ తెలుస్తుంది. ఇబ్బందులు ఎదురైనప్పుడే మీకు గెలుపు వాల్యూ తెలుస్తుంది. దాని కోసం ఎంత కష్టపడాలో అర్థమవుతుంది. మనకు వచ్చిన గెలుపు ఎంతో విలువైనదని అర్థమవుతుంది. తాతా ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తిపై ఎప్పుడూ అంత విలువ ఉండదు. మనం సంపాదించడం మొదలు పెట్టినప్పుడే.. వారి కష్టం.. అర్థమవుతుంది. మీ దగ్గర ఉన్న ఆస్తి విలువు అప్పుడు సరిగ్గా తెలుస్తుంది. కష్ట సమయం గడిచాక మళ్లీ మంచి సమయాన్ని చూసినప్పుడు మాత్రమే మనం దానిని ఆస్వాదిస్తాము.

ఏదైనా లేదా ఎవరినైనా కోల్పోయినప్పుడే వాటి విలువ తెలుస్తుంది. ఉదాహరణకు తల్లిదండ్రులను తీసుకున్నా అంతే. మన అనుకునేవారిని ఎప్పుడూ మనం గ్రాంటెడ్​గా తీసుకుంటాము. అప్పుడు వారి విలువ మనకు అంతగా తెలియదు. కానీ వారికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రమే వారి విలువ మనకు తెలుస్తుంది. వారికి దగ్గరవ్వాలనే కోరిక మనలో పెరుగుతుంది. కాబట్టి మనతో ఉన్నవాటిని ఎప్పుడూ చులకనగా చూడకండి. ఓటమి వస్తే ధైర్యంగా ఎదుర్కోండి. అప్పుడే మీరు నిజంగా సక్సెస్ అవుతారు.

టాపిక్