Wednesday Motivation : సక్సెస్ అవ్వాలంటే.. ఓపికగా ఉండడం అలవాటు చేసుకోవాలి..-wednesday motivation on be patient and stay the curse ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Wednesday Motivation : సక్సెస్ అవ్వాలంటే.. ఓపికగా ఉండడం అలవాటు చేసుకోవాలి..

Wednesday Motivation : సక్సెస్ అవ్వాలంటే.. ఓపికగా ఉండడం అలవాటు చేసుకోవాలి..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 31, 2022 08:55 AM IST

Wednesday Motivation : ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు లేదా దేనినైనా పొందాలి అనుకున్నప్పుడు.. ఎంత వీలైతే అంత ఓపికగా ఉండాలి. ఎందుకంటే కొన్ని విషయాలు అంత సులువుగా రావు. ప్రశాంతంగా, ఓపికగా లేకపోతే.. కోపంతో మనం దానిని వదిలేసుకుంటాం. అలా జరగకూడదంటే ఓపికగా ఉండడం అలవాటు చేసుకోవాలి.

<p>కోట్ ఆఫ్ ద డే</p>
కోట్ ఆఫ్ ద డే

Wednesday Motivation : విత్తనం నాటిన రోజే అది మొక్కై.. పండుని ఇస్తుందా? కాదు కదా.. విత్తనం మొలకెత్తాలి. పెరగాలి. సరైన పోషణతో ఎదిగి మనకు పండునివ్వాలి. ఇవన్నీ జరగాలంటే దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. పురుగులు పట్టకుండా.. కొమ్మలు విరగకుండా.. ఏ ఇతర ఇబ్బందులు రాకుండా దానిని ఓపికతో కాపాడుకుంటే.. కొన్ని సంవత్సరాలకో, నెలలకో అది పండ్లు ఇవ్వడం మొదలుపెడుతుంది. అలాగే మన హోప్​ అనేది విత్తనం లాంటిది. అది వెంటనే ఫలితాలు ఇవ్వదు.

మనం తగినంత శ్రద్ధ వహిస్తూ.. ఓపికగా ఉంటే ఏదొక రోజు దాని ఫలితాలు ఇస్తుంది. మన ఎఫర్ట్స్​ని బట్టి మన రిజల్ట్ ఉంటుంది. మన ఎఫర్ట్స్​లోనే లోపం ఉందనుకోండి.. ఇక మనం ఆ హోప్​ మీద ఆశలు వదులుకోవాల్సివస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. అంత ఈజీగా వస్తే ఇప్పటికీ అందరూ సక్సెస్ అయిపోయి ఉంటారు. కొందరికి ఈజీగా సక్సెస్ వచ్చిందనుకుంటాము కానీ.. ఆ ఈజీగా రావడానికి వారెంత కష్టపడ్డారో కూడా మనం ఆలోచించాలి.

ఆ సమయంలో వచ్చే కొన్ని విషయాలను దాటడం అంత సులభంగా అనిపించదు. కానీ వాటిని అధిగమిస్తే.. మీరు కావాలనుకున్నది దక్కించుకునే అవకాశం ఉంటుంది. మనం ఎంత కష్టపడి పనిచేస్తే.. ఎంత బాగా హోప్​ని సంరక్షిస్తే.. దాని ఫలాలను, సానుకూల ఫలితాలను పొందగలమో ఆలోచించండి. ప్రతి దశలోనూ మీ బెస్ట్ ఇవ్వండి. ఓపికను, ప్రశాంతతను కోల్పోకండి. కోపం దరిచేరనీయకండి. అది వచ్చిందంటే మీ కలలు కళ్లలై పోతాయి.

ఈరోజు కాలేదా? రేపు అవుతుందనే హోప్​తో మీ నమ్మకాన్ని వదులుకోకండి. రేపుకాకుంటే ఎల్లుండి అయినా మీ జీవితం మారవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం అవ్వొచ్చు. ఇంకెన్ని రోజులు ఇలా వేచి చూడాలని బాధ కలగవచ్చు. ఈ రెండింటినీ అధిగమిస్తేనే మీకు మంచి ఫలితాలు దక్కుతాయి. కాబట్టి వీటిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అధిగమించండి.

Whats_app_banner

సంబంధిత కథనం