Thursday Quote : ఓడిపోయారని బాధపడకండి.. ఓటమి మిమ్మల్ని గెలుపువైపే నడిపిస్తుంది..
Thursday Thought : ఎవరి జీవితంలోనైనా.. విజయాలు ఎంత ముఖ్యపాత్ర వహిస్తాయో.. అపజయాలు కూడా అంతే రోల్ ప్లే చేస్తాయి. గట్టిగా మాట్లాడితే సక్సెస్‌లో కంటే ఓటమినుంచే ఎక్కువ విషయాలను నేర్చుకుంటాము. కాబట్టి ఓటమి అనేది ఏమి చెడు విషయం కాదని గుర్తించుకోండి. అది వ్యక్తిగా మీరు ఎదగడానికి సహాయం చేస్తుంది.
Thursday Motivation : వైఫల్యమనేది మన జీవితంలో ఒక భాగం. ప్రతిఒక్కరూ విజయాన్నే కోరుకుంటారు. ఓడిపోతామని తెలిసి.. ఎవరూ ట్రై చేయరు కదా. కానీ ఓడిపోతే మాత్రం కృంగిపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. విజయం ఎంత కిక్నిస్తుందో.. ఓటమి అంతకంటే ఎక్కువ పాఠాలను నేర్పిస్తుంది. తరువాత సక్సెస్కోసం ఎంత కష్టపడాలో తెలియజేస్తుంది. ఏదారిలో వెళ్లితే కరెక్ట్ కాదో.. ఎలా వెళ్తే ఓటమి తప్పదో అనే విషయాలు ఓడిపోయినవాళ్లకే బాగా తెలుస్తాయి.
ట్రెండింగ్ వార్తలు
అపజయాలు ఏమి చెడ్డవిషయాలు కావు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మళ్లీ ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆలోచించాలి కానీ.. ఓడిపోయామని ఆగిపోవడం, కృంగిపోవడం కరెక్ట్ కాదు కదా. ఓటమి జీవితంలో మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. విజయం కంటే.. ఓటమినే మన చుట్టూ ఉన్నవారు ఎలాంటివారో తెలియజేస్తుంది. కాబట్టి వైఫల్యం వచ్చినప్పుడు.. దుకాణం కట్టేసి ఆగిపోకండి. అది కరెక్ట్ కాదు.
ఓటమి నేర్పించే పాఠాలతో మీ వ్యక్తిత్వం కొత్తగా వికసిస్తుంది. ఓటమి నేర్పించే పాఠాలు ఇప్పుడే కాదు.. లైఫ్‌లాంగ్ మీకు ఉపయోగపడతాయి. ఎదుటివారికి మీ అనుభవాలు పంచుతాయి. మన తప్పులు తెలుసుకునేలా చేస్తాయి. ఎదుటివాళ్ల తప్పులను, మన తలరాతను తిట్టుకునే కన్నా ముందు.. మన తప్పులను అంగీకరించడం చాలా మంచిది. ఇలా చేస్తే.. ఎవరిని మనం నిందించము. వ్యక్తిగా మనకు మనమే రియలైజ్ అవుతాము. ఎలా ఉండాలి. ఏమి చేయాలి. ఎలా ఉండకూడదు అనే విషయాలపై స్పష్టత వస్తుంది. క్రమశిక్షణ పెరుగుతుంది. సహనం ఎక్కువ అవుతుంది. అప్పుడు విజయం కోసం మరింత కష్టపడతాము.
లైఫ్‌లో మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకోవాలనుకుంటే ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి.. మీ ప్రయత్నాలను కొనసాగించండి. ఒక వైఫల్యం మీ భవిష్యత్తును స్వాధీనం చేసుకోనివ్వవద్దు. మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి.
సంబంధిత కథనం