తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Dinner Recipe । పెసరిపప్పు మెంతికూర.. రాత్రి భోజనంకు తేలికైన, రుచికరమైన రెసిపీ!

Healthy Dinner Recipe । పెసరిపప్పు మెంతికూర.. రాత్రి భోజనంకు తేలికైన, రుచికరమైన రెసిపీ!

HT Telugu Desk HT Telugu

23 May 2023, 19:47 IST

    • Moong Dal Methi Curry Recipe: రాత్రి భోజనంలో రుచికరమైన, తేలికైన ఆహారం కోరుకునే వారికి పెసరిపప్పు మెంతికూర రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. ఈ కూరను పుల్కాలు, జీరా రైస్ లేదా అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. 
Moong Dal Methi Curry Recipe
Moong Dal Methi Curry Recipe (Slurrp)

Moong Dal Methi Curry Recipe

Healthy Dinner Recipes: రాత్రి భోజనంలో రుచికరమైన, తేలికైన ఆహారం కోరుకునే వారు పెసరిపప్పును వండుకోవచ్చు. పెసరిపప్పును పప్పు ధాన్యాలలో రాణిగా అభివర్ణిస్తారు. ఈ పప్పు జీర్ణం కావడానికి సులభమైనది, అంతేకాకుండా తక్కువ గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పప్పులోని పోషక విలువలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే పెసర్లను సూపర్ ఫుడ్‌గా పరిగణిస్తారు. పెసరిపప్పులో మెంతికూరను కలిపి వండుకుంటే ఆ వంటకం మరింత రుచికరంగా, పోషకభరితంగా మారుతుంది. మెంతికూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ అదుపుచేస్తుంది, శరీరంలో నొప్పి, వాపులను తగ్గించటానికి, గుండెజబ్బులు, రక్తపోటు తగ్గించటానికి తల్లులలో పాల ఉత్పత్తిని పెంచడానికి, అధిక బరువు తగ్గడానికి మెంతి చాలా మంచిది.

పెసరిపప్పు మెంతికూర రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. సూచనలు చదువుతూ సులభంగా వండుకోవచ్చు.

Moong Dal Methi Curry Recipe కోసం కావలసినవి

  • 1/2 కప్పు నానబెట్టిన పెసరిపప్పు
  • 2 కప్పులు మెంతి ఆకులు
  • 2 టొమాటోలు
  • 1 ఉల్లిపాయ
  • 4 పచ్చిమిర్చి
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • 1 టీస్పూన్ అల్లం
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • 1/4 టీస్పూన్ పసుపు పొడి
  • 3/4 టీస్పూన్ ధనియాల పొడి
  • 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • 1/2 కప్పు నీరు
  • చిటికెడు ఇంగువ
  • రుచికి తగినంత ఉప్పు

పెసరిపప్పు మెంతికూర తయారీ విధానం

  1. ముందుగా కడాయిలో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇంగువ వేసి కొన్ని సెకన్ల పాటు వేయించాలి.
  2. అనంతరం ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఆపై అల్లం తురుము, టొమాటో ముక్కలు వేసి టమోటాలు మెత్తబడే వరకు ఎక్కువ మంట మీద ఉడికించాలి.
  3. ఇప్పుడు నానబెట్టిన పెసరిపప్పు, పసుపు, ధనియాల పొడి వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాలి.
  4. ఆపై అరకప్పు నీరు, తగినంత ఉప్పు వేసి అన్నీ సరిగ్గా కలపాలి.
  5. ఈ పప్పును 7 నుండి 8 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలి, పప్పు ఉడుకుతుండగా మెంతిఆకులు వేసి 2 నుండి 3 నిమిషాలు ఎక్కువ వేడి మీద వేయించాలి.

అంతే, పెసరిపప్పు మెంతికూర రెడీ. ఈ కూరను పుల్కాలు, జీరా రైస్ లేదా అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది.