తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bitter Gourd Curry: చేదులేని కాకరకాయ ఉల్లికారం కూర

bitter gourd curry: చేదులేని కాకరకాయ ఉల్లికారం కూర

09 May 2023, 12:00 IST

  • bitter gourd curry: ఉల్లికారంతో కమ్మని కాకరకాయ కూర ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

కాకరకాయలు
కాకరకాయలు (pixabay)

కాకరకాయలు

కాకరకాయ ఆరోగ్య ప్రయోజనాలు బోలెడని తెలిసినా చేదు వల్ల పక్కన పెట్టేస్తాం. కానీ ఈసారి ఈ ఉల్లికారంతో కాకరకాయ కూర వండి చూడండి. ఏమాత్రం చేదు తెలీకుండా, పిల్లలు కూడా రుచిగా అడిగిమరీ తింటారు.

ట్రెండింగ్ వార్తలు

Chanakya Niti On Morning : మీ ఇంట్లో సంతోషం ఉండాలంటే ప్రతీ ఉదయం ఈ 5 పనులు చేయండి

Saree Cancer: ‘చీర క్యాన్సర్’ గురించి విన్నారా? ఇది ఎవరికి వస్తుందో చెబుతున్న వైద్యులు

Coconut Upma: టేస్టీ కొబ్బరి ఉప్మా రెసిపీ, బ్రేక్ ఫాస్ట్‌లో అందరికీ నచ్చడం ఖాయం

Saturaday Motivation: సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాదు సముద్రమంత లోతుగా ఆలోచించండి వాస్తవాలను గ్రహించండి

కావాల్సిన పదార్థాలు:

కాకర కాయలు - 300 గ్రాములు

ఉల్లిపాయ - 1 పెద్దది

కారం - 1 టేబుల్ స్పూన్

వెల్లులి - 4 రెబ్బలు

పసుపు - టీస్పూన్

ఉప్పు - తగినంత

నూనె - 6 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర - కొద్దిగా

జీలకర్ర - సగం టేబుల్ స్పూన్

ధనియాలు - సగం టేబుల్ స్పూన్

తయారీ విధానం:

step 1:ముందుగా కాకరకాయల పైచెక్కు తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కుని ఉప్పు, పసుపు కలిపి పక్కన పెట్టాలి. కాసేపయ్యాక నీళ్లు పిండేసి కాకరకాయ సైజును బట్టి రెండు మూడు ముక్కలు చేసుకోవాలి. ఒక్కో ముక్క అంగుళం పొడవుంటే సరిపోతుంది.

step 2: కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. అవి కాస్త రంగు మారి మెత్త బడేంత వరకు నూనెలో వేగనివ్వాలి. వేగాక ఒక ప్లేటులోకి ముక్కల్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గింజలుంటే తీసేయాలి.

step 3: మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు, కారం, జీలకర్ర, ధనియాలు, ఉప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.

step 4: ఈ మిశ్రమాన్ని కాకరకాయ ముక్కల మధ్యలో పెట్టుకోవాలి. మిగిలిన మసాలా పక్కన ఉంచుకోండి.

step 5: ఇప్పుడు కాకర కాయ ముక్కలు వేయించిన కడాయిలోనే ఇంకాస్త నూనె వేసుకుని వేడెక్కాక, మసాల కూర్చి పెట్టుకున్న కాకరముక్కలు దూరం దూరంగా పెట్టుకోవాలి.

step 6: మూత మూసి ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇప్పుడు మిగతా మసాలా మిశ్రమం ఏమైనా మిగిలితే ముక్కల మీద వేసేసుకోండి. నూనెలో కలుపుతూ వేగనివ్వండి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించేసుకోవడమే.

టాపిక్

తదుపరి వ్యాసం