Stuffed Kakarakai Recipe : చేదును మరపించి.. రుచిని పెంచే స్టఫ్డ్ కాకరకాయ..
Stuffed Bitter Gourd Recipe : చాలామంది కాకరకాయ తినేందుకు ఇష్టపడరు. కానీ దాని వ్లల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు. మరి దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు కాదనకుండా ఎలా తినిపించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే.
Stuffed Kakarakai Recipe : కాకరకాయను టేస్టీగా మార్చే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? అదే స్టఫ్డ్ కాకరకాయ. దీనిని మరింత రుచిగా మార్చేందుకు బంగాళదుంపలను ఈ రెసిపీలో ఉపయోగిస్తాము. ఇది మీకు చేదు రుచిని దూరం చేసి.. రుచిని మాత్రం పక్కా అందిస్తుంది. దీనిని మీరు పప్పుకు తోడుగా తీసుకోవచ్చు. లేదంటే స్నాక్స్ వలె కూడా తీసుకోవచ్చు. ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* కాకరకాయలు - 5
* బంగాళదుంపలు - 2 ఉడికించినవి
* పసుపు - 1/4 టీస్పూన్
* కారం - 1/2 టీస్పూన్
* గరం మసాలా పొడి - 1 టీస్పూన్
* చాట్ మసాలా - 1 టీస్పూన్
* ఉప్పు - అవసరమైనంత
* నూనె - అవసరమైనంత
తయారీ విధానం
ఆలూ రెసిపీతో స్టఫ్డ్ కాకర చేయడానికి.. ముందుగా కాకరకాయలను చేయండి. చేదును తొలగించడానికి ఉప్పు, పసుపుతో శుభ్రం చేయండి. వాటిని 20-25 నిమిషాలు పక్కన ఉంచేయండి. అనంతరం ప్రతి కాకరకాయను నిలువుగా చీల్చండి. దానిలోని గుజ్జును తీసి పక్కన పెట్టండి.
ఇప్పుడు పొటాటో మసాలా సిద్ధం చేసుకోవాలి. మిక్సింగ్ గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను తీసుకోండి. పసుపు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొటాటో మసాలా ఫిల్లింగ్‌ను కాకరయకాయలో నింపేయండి.
ఫ్రైయింగ్ పాన్ తీసుకుని.. నూనె వేడి చేయండి. స్టఫ్ బయటకు రాకుండా.. కాకరకాయను నిమిషం పాటు నిస్సారంగా వేయించాలి. అనంతరం దానిని మూతపెట్టి బాగా ఉడికినంత వరకు తక్కువ, మీడియం మంట మీద ఉడికించాలి. కాకరకాయలు చక్కగా, మెత్తగా మారిన తర్వాత.. దించేయండి. అంతే ఇవి తినడానికి సిద్ధంగా ఉన్నట్లే. ఇంకేంటి మరి ఆరోగ్య ప్రయోజనాలకోసం మీరు కాకరకాయను హ్యాపీగా లాగించేయండి.
సంబంధిత కథనం