తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dahi Okra Curry: పెరుగు బెండకాయ.. మంచి గ్రేవీ కర్రీ

dahi okra curry: పెరుగు బెండకాయ.. మంచి గ్రేవీ కర్రీ

11 May 2023, 13:06 IST

  • dahi okra curry: బెండకాయలో పెరుగు కలిపి దహీ బేండీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. 

పెరుగు బెండకాయ కూర
పెరుగు బెండకాయ కూర

పెరుగు బెండకాయ కూర

బెండకాయల్ని ఫ్రై లేదా కూర చాలా సార్లు చేసుకుని ఉంటారు. ఈ ఎండాకాలంలో కాస్త గ్రేవీ ఉన్న కూరలైతే నోటికి రుచిస్తాయి. ఒకసారి పెరుగు వేసి బెండకాయ కూరని చేసి చూడండి. పుల్ల పుల్లగా భలే ఉంటుంది. చేయడం కూడా సులువే.

ట్రెండింగ్ వార్తలు

Glowing Skin : మెరిసే చర్మం కావాలంటే రోజుకు రెండుసార్లు కొబ్బరి నీటిని అప్లై చేయండి

Chanakya Niti Telugu : భార్య దగ్గర చేసే ఈ 6 తప్పులు బంధాన్ని పాడు చేస్తాయి

Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024: ఎలాంటి మహిమలూ, మ్యాజిక్కులూ తెలియని సూపర్ హీరో అమ్మ, ఆమె ప్రేమే బిడ్డకు రక్ష

కావాల్సిన పదార్థాలు:

బెండకాయలు - 300 గ్రాములు

పెరుగు - 1 కప్పు

పుట్నాల పొడి - 1 టేబుల్ స్పూన్

ఉల్లిపాయ -2 చిన్నవి

జీలకర్ర- అర టీస్పూన్

ఆవాలు - అర టీస్పూన్

కొత్తిమీర -కొద్దిగా

పసుపు- టీస్పూన్

ఉప్పు - తగినంత

ధనియాల పొడి- అర టీస్పూను

జీలకర్ర పొడి- అర టీస్పూను

గరం మసాలా - టీస్పూన్

కారం- రెండు టేబుల్ స్పూన్లు

నూనె -3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

step 1: ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడిపోయేంత వరకు ఆరనివ్వాలి. ఇప్పుడ తొడిమ తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.

step 2: ఇప్పుడు వెడల్పాటి అడుగు మందగా ఉన్న వంట పాత్రను పొయ్యి మీద పెట్టుకోండి. నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి.

step 3: ఇప్పుడు సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని రంగు మారేంత వరకు వేగనివ్వాలి. బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి.

step 4: బెండకాయలు దాదాపు ఉడికిపోయాక పసుపు, కారం, వేసుకోవాలి. మరో గిన్నెలో పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా , పుట్నాల పొడి కలిపి పెట్టుకోవాలి.

step 5: ఈ పెరుగు మిశ్రమాన్ని వేగుతున్న బెండకాయల్లో వేసుకోవాలి. పెరుగు మిశ్రమం వేసుకోగానే కలుపుతూ ఉండాలి. కాసేపటికి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు అరకప్పు నీళ్లు, కొత్తిమీర కూడా వేసుకుని కూర బాగా కలుపుకోవాలి. రెండు నిమిషాలు ఉడకనిచ్చి దింపేస్తే చాలు. పెరుగు బెండకాయ సిద్ధం.

టాపిక్

తదుపరి వ్యాసం