Tips to find food adulteration: మీరు తినే తేనెలో నూనెలో కల్తీ ఉందనిపిస్తుందా? కల్తీని ఇలా తెలుసుకోండి-food adulteration finding techniques at home of haldi chilli powder honey ghee ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Find Food Adulteration: మీరు తినే తేనెలో నూనెలో కల్తీ ఉందనిపిస్తుందా? కల్తీని ఇలా తెలుసుకోండి

Tips to find food adulteration: మీరు తినే తేనెలో నూనెలో కల్తీ ఉందనిపిస్తుందా? కల్తీని ఇలా తెలుసుకోండి

food adulteration: పిల్లలకు పాలు తాగించేటపుడు, ఉదయాన్నే ఆరోగ్యం కోసం తేనె నీళ్లు తాగేటపుడు.. ఇలా చాలా సార్లు వీటిలో ఏమైనా కల్తీ ఉందేమో అనే అనుమానం వస్తుంటుంది. ఆ అనుమానం తీర్చుకోడానికి కొన్ని చిట్కాలు తెలుసుకోండి.

తేనె (pexels)

food adulteration: మనం తినే వస్తువుల్లో మనకు తెలీకుండా ఏదైనా కల్తీ జరుగుతుందేమో అనిపిస్తుంటుంది. మన మనసులో ఆ సందేహం వచ్చిందంటే మనం కొనుగోలు చేసే చోటు మార్చాలి. మరేదైనా మంచి దుకాణం కోసం కొంత మందిని అడిగి తెలుసుకోండి. మీ మనసులో సందేహం తీర్చుకోవడం కోసం ఇంట్లోనే కొన్ని సులువైన పద్ధతుల ద్వారా ఆ కల్తీ గురించి కనిపెట్టొచ్చు. ప్రతి పదార్ధం స్వచ్ఛతను తెలుసుకోడానికి వివిధ పద్ధతులున్నాయి.

తేనె:

తేనెలో పంచదార లేదా పంచదార సిరప్ కలిపి కల్తీ చేస్తుంటారు. దాని స్వచ్ఛతను తెలుసుకోడానికి ఒక గాజు గ్లాసులో నీరు తీసుకోండి. అందులో ఒక చెంచా తేనె వేయండి. అది వెంటనే నీటిలో కలిసిపోతే స్వచ్ఛత లేనట్లే. స్వచ్ఛమైన తేనె గ్లాసు అడుగు భాగానికి చేరి కాసేపయ్యాక కరుగుతుంది.

కొబ్బరి నూనె:

రిఫైన్డ్ నూనెలు తింటే అనారోగ్యమని చాలా మంది గానుక నూనెలు, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు వాడుతున్నారు. కొబ్బరి నూనెను వంటల్లోకి, జుట్టుకు కూడా వాడతాం. వాటిలో కూడా కల్తీ ఉంటే కష్టమే. దాని స్వచ్ఛత తెలుసుకోవడం కోసం కొబ్బరి నూనెను ఒక గాజు గ్లాసులో పోసి ఫ్రిజ్ లో పెట్టండి. ఒక అరగంట తరువాత చూస్తే అది పూర్తిగా గడ్డకట్టిపోవాలి. అలా కాకుండా మీద నూనె లాగా రెండు మూడు రకాల నూనె పొరలు కనిపిస్తే ఏదైనా వేరే నూనెలతో కల్తీ జరిగిందని అర్థం.

పసుపు:

ఒక చెంచా పసుపును గ్లాసు నీటిలో వేయండి. దాన్ని ఒక 20 నిమిషాలు కదిలించకండి. కాసేపయ్యాక అసలైన పసుపైతే గ్లాసు అడుగుకి చేరుకుంటుంది. నీళ్లు కూడా కొద్దిగా లేత పసుపు రంగులోకి మారతాయి. అదే కల్తీ పసుపు అయితే నీళ్లు ముదురు పసుపు పచ్చ రంగులో కనిపిస్తాయి.

కారం:

కారంలో ఎక్కువగా కృత్రిమ రంగులు వాడి లేదంటే ఇంకేదైనా పొడి కలిపి కల్తీ చేసే అవకాశం ఉంది. దాన్ని తెలుసుకోడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ల మీద కొద్దిగా కారం పొడి చల్లండి. అది రంగు వదిలితే కల్తీ అని అర్థం.

నెయ్యి:

ఒక చిన్న గాజు గ్లాసులో నెయ్యి వేసి ఫ్రిజ్‌లో పెట్టండి. అది గడ్డకట్టుకుపోవాలి. అలాకాకుండా నూనెలాగా మిగిలితే వేరే నూనెలు కలిపి కల్తీ చేశారని అర్థం. పిండి లేదా స్టార్చ్ కలిపి చేసిన కల్తీ గుర్తించాలంటే.. కరిగించిన నెయ్యిని ఒక గిన్నెలో తీసుకోండి. అందులో రెండు మూడు చుక్కల ఉప్పు నీరు వేయండి. అది కనకు ఊదా రంగు (purple colour) లోకి మారితే స్టార్చ్ తో కల్తీ జరిగినట్లే.

సంబంధిత కథనం