తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Capsicum Paneer Curry: పనీర్ క్యాప్సికం గ్రేవీ కర్రీ.. చపాతీలోకి అదిరిపోతుంది..

capsicum paneer curry: పనీర్ క్యాప్సికం గ్రేవీ కర్రీ.. చపాతీలోకి అదిరిపోతుంది..

21 May 2023, 12:18 IST

google News
  • capsicum paneer curry: పనీర్ క్యాప్సికం కర్రీ సులభంగా, రుచిగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో సహా చూసేయండి. 

capsicum paneer recipe
capsicum paneer recipe (bing)

capsicum paneer recipe

మధ్యాహ్నం పూట చపాతీలోకి, అన్నంలోకి రుచిగా ఉండే పనీర్ క్యాప్సికం ఒకసారి ప్రయత్నించి చూడండి. 20 నిమిషాల్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. పనీర్, క్యాప్సికం ఉంటే చాలు. మిగతా అన్ని పదార్థాలు దాదాపు ఇంట్లో ఉండేవే. ఈ కర్రీని బటర్ లేదా నూనె వాడి చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

100 గ్రాముల పనీర్

2 క్యాప్సికం పెద్దవి

2 టమాటాలు

రెండు స్పూన్ల జీడిపప్పు

1 ఉల్లిపాయ పెద్దది

అర అంగుళం దాల్చిన చెక్క

2 లవంగాలు

2 యాలకులు

1 బిర్యానీ ఆకు

చిన్న అల్లం ముక్క

1 చెంచా గరం మసాలా పొడి

1 చెంచా కారం

1 చెంచా ధనియాల పొడి

1 చెంచా జీలకర్ర పొడి

కొద్దిగా కసూరీ మేతీ

సగం టీస్పూన్ పసుపు

3 టేబుల్ స్పూన్ల నూనె

కొద్దిగా కొత్తిమీర

తయారీ విధానం:

  1. ముందుగా మిక్సీలో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్క, జీడిపప్పు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి
  2. కడాయిలో నూనె వేసుకుని కొంచెం వేడి కాగానే కారం వేసుకోవాలి. నూనెలో కారం కలిసిపోయేలా కలిపి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.
  3. అయిదు నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. నూనె పైకి తేలితే పచ్చివాసన పోయినట్లే. ఇపుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
  4. ఇందులో అరగ్లాసు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోండి. రెండు నిమిషాలు ఉడికాక కాస్త పెద్దగా తరుగుకున్న పచ్చి క్యాప్సికం ముక్కల్ని వేసేసుకోండి.
  5. క్యాప్సికం ముక్కలు మగ్గిపోతాయి. దీంట్లో పనీర్ ముక్కలు కూడా వేసుకుని రెండు నిమిషాలయ్యాక కసూరీ మేతీ, కొత్తిమీర వేసుకుని దించుకుంటే చాలు. ఇది చపాతీల్లోకి, అన్నంలోకి కూడా తినొచ్చు.

తదుపరి వ్యాసం