High Protein Breakfast : బ్రేక్​ఫాస్ట్ లోకి పనీర్ బూర్జీ ట్రై చేయండి..-high protein breakfast try this healthy and tasty recipe of paneer bhurji recipe details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  High Protein Breakfast Try This Healthy And Tasty Recipe Of Paneer Bhurji Recipe Details Inside

High Protein Breakfast : బ్రేక్​ఫాస్ట్ లోకి పనీర్ బూర్జీ ట్రై చేయండి..

HT Telugu Desk HT Telugu
Feb 07, 2023 06:00 AM IST

Paneer Bhurji Making : ఉదయాన్నే మీరు ఆరోగ్యకరమైన హై ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకు పనీర్ బూర్జీ ట్రై చేయండి. టెస్టీగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి మంచిది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

బ్రేక్ ఫాస్ట్ కరెక్టుగా చేస్తేనే... రోజంతా యాక్టీవ్ గా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ లో పనీర్ తీసుకోవడం వల్లా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పనీర్ నుంచి ప్రోటీన్ అందుకోవచ్చు. మీ అల్పాహారాన్ని ఆరోగ్యంగా, రుచికరంగా చేసుకునేందుకు పనీర్ బూర్జీని ట్రై చేయండి.

మీరు రెగ్యులర్ గా పనీర్ కర్రీ తినడం వల్ల విసుగు చెందితే.., ఈసారి పనీర్‌తో చేసిన హై-ప్రోటీన్ కొత్త వంటకాన్ని ప్రయత్నించొచ్చు. పనీర్ బూర్జీ తయారు చేసి.. మీ అల్పాహారాన్ని హెల్తీగా, టేస్టీగా మార్చుకోండి. ఇది తయారు చేయడం చాలా సులభం. మీ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలను కలిగి ఉండే పనీర్ బూర్జీని మీరు ప్రయత్నించవచ్చు. పనీర్ బూర్జీని సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికి తక్కువ సమయం కూడా పడుతుంది.

ఇంట్లో తయారు చేసిన పనీర్ 200 గ్రాములు తీసుకోండి. కొంచెం నెయ్యి, 4 గ్రాముల జీలకర్ర, 70 గ్రా ఉల్లిపాయలు, 5 గ్రా అల్లం, 5 గ్రా వెల్లుల్లి, 5 గ్రా పచ్చిమిర్చి, 70 గ్రాములు టమోటా, 1 గ్రాము పసుపు పొడి, 2 గ్రాముల ఎర్ర కారం పొడి, 2 గ్రాముల ధనియాల పొడి, 20 గ్రాముల తాజా కొత్తిమీర, రుచి ప్రకారం ఉప్పు వేసుకోవాలి.

ముందుగా పనీర్‌ను చేతితో ముద్దగా చేసుకోవాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను సిద్ధం చేయండి. స్టవ్ వెలిగించి.. దీని తరువాత పాన్ లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర, ఉల్లిపాయలను వేయించాలి. ఉల్లిపాయ మెత్తగా అయ్యాక అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం-వెల్లుల్లి వాసన రావడం ఆగిపోయాక టొమాటోలు వేయాలి. చిటికెడు ఉప్పు వేసి, టొమాటోలు మెత్తబడే వరకు వేయించాలి.

టొమాటోలు ఉప్పుతో త్వరగా కరిగిపోతాయి. టొమాటోలు పూర్తిగా ఉడికిన తర్వాత, అన్ని పొడి మసాలాలు వేసి, మిశ్రమాన్ని 3-4 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత పనీర్ వేసి ఒక నిమిషం పాటు బాగా కలపాలి. పనీర్ నిమిషానికి మించి వేయించకూడదని గుర్తుంచుకోండి. లేకుంటే గట్టిగా మారుతుంది. ఇంతే.. పనీర్ బూర్జీ సిద్ధంగా ఉంది. తాజా కొత్తిమీరను పైన చల్లి.. పరాటాతో కలిపి లాగించేయండి.

WhatsApp channel

టాపిక్