తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Veg Noodles Pakodi Recipe : కరకరలాడే వెజ్ నూడుల్స్ పకోడి.. ఓ లుక్ వేసి కుక్ చేసేయండి..

Veg Noodles Pakodi Recipe : కరకరలాడే వెజ్ నూడుల్స్ పకోడి.. ఓ లుక్ వేసి కుక్ చేసేయండి..

18 November 2022, 6:59 IST

    • Veg Noodles Pakodi Recipe : ఉదయాన్నే క్రంచీగా, కొత్తగా ఏమైనా తినాలనిపించినా.. లేదంటే మీ టీ కోసం పర్​ఫెక్ట్ పార్టనర్​ గురించి ఆలోచిస్తున్నా.. మీకు వెజ్ నూడుల్స్ పకోడి బెస్ట్ ఆప్షన్. ఈ చలికాలంలో.. వెచ్చని పకోడిలు లాగిస్తుంటే.. ఆ ఫీలింగ్ వివరించాల్సిన అవసరమే లేదు. 
వెజ్ నూడుల్స్ పకోడి
వెజ్ నూడుల్స్ పకోడి

వెజ్ నూడుల్స్ పకోడి

Veg Noodles Pakodi Recipe : నూడుల్స్​తో పకోడి. అవును మీరు చూస్తుంది కరెక్టే. నూడుల్స్​తో మీరు కరకరలాడే పకోడిని చేసుకోవచ్చు. పైగా దీనిని హెల్తీగా చేసుకోవడం కోసం మీరు దీనిలో మరిన్ని కూరగాయాలు కలిపి తీసుకోవచ్చు. ఇది మీకు మంచి రుచితో పాటు.. చక్కని ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మీరు మిల్లెట్ నూడుల్స్ తీసుకుంటే.. ఇంకా మంచిది. మరి కరకరలాడే నూడుల్స్ పకోడిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Peanuts for Diabetic: మధుమేహం ఉన్నవారు వేరుశెనగ పలుకులను తినడం ప్రమాదమా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Ghee with Milk: గోరువెచ్చని పాలలో ఒక స్పూను నెయ్యి కలుపుకొని రోజూ తాగి చూడండి, మీలో మార్పును గమనించండి

Chanakya Niti Telugu : పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే

Carrot Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

కావాల్సిన పదార్థాలు

* మిల్లెట్ నూడుల్స్ - 1/2 ప్యాక్

* క్యారెట్ - 1 (తురిమినది)

* క్యాప్సికమ్ - 1 (సన్నగా తరిగాలి)

* క్యాబేజి - అర కప్పు (సన్నగా తరిగాలి)

* పచ్చి మిర్చి - 1 (సన్నగా తరిగాలి)

* ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగాలి)

* శనగ పిండి - 1/2 కప్పు

* ఉప్పు - సరిపడినంత

* నూనె - డీప్ ఫ్రై కోసం

తయారీ విధానం

వెజ్ నూడిల్ పకోడి తయారు చేయడానికి.. ముందుగా మిల్లెట్ నూడుల్స్ వండుకోవాలి. గిన్నెలో నీళ్లు తీసుకుని స్టవ్ వెలిగించి.. దానిపై గిన్నె పెట్టాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో నూడుల్స్ వేయాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. అవి సగం ఉడికిన తర్వాత.. నీటిని తీసివేసి.. మరింత ఉడకకుండా ఉండటానికి చల్లటి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పెద్ద మిక్సింగ్ గిన్నె తీసుకుని.. దానిలో క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీతో పాటు శనగపిండి, ఉప్పు, నూడుల్స్ మసాలా టేస్ట్ మేకర్ వేసి, అన్నింటినీ పొడిగా కలపండి. ఇప్పుడు అదే గిన్నెలో ఉడికించిన నూడుల్స్ వేసి.. వాటి జిగటతో.. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. (నీరు వేయకుండా..)

అనంతరం పకోడిలను డీప్ ఫ్రై చేయడానికి.. నూనె వేడి చేయండి. స్టవ్ మీడియంలో ఉంచండి. ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని పకోడీలుగా నూనెలో వేయండి. అవి బంగారు రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి. అదనపు నూనెను పీల్చుకోవడానికి టిష్యూలు ఉపయోగించండి. వీటిని మీరు గ్రీన్ చట్నీ, లేదా మీకు ఇష్టమైన డిప్ లేదా సాధారణ టొమాటో సాస్‌తో వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మీ టీకి జోడిగా దీనిని వండుకోవచ్చు.

టాపిక్