తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Ponganalu Recipe : ఓట్స్​తో పొంగనాలు.. తయారు చేయడం చాలా సింపుల్

Oats Ponganalu Recipe : ఓట్స్​తో పొంగనాలు.. తయారు చేయడం చాలా సింపుల్

16 November 2022, 6:39 IST

    • Oats Ponganalu Recipe : ఓట్స్ అనేవి మంచి ఆరోగ్యానికి ఎప్పుడూ మంచి ఎంపికే. ఎందుకంటే ఇవి ఫైబర్ రిచ్ అల్పాహారం కోసం సరైన ఎంపిక. కానీ రోజూ ఓట్స్ ఒకే విధంగా తీసుకోవడం కాస్త ఇబ్బందే. అయితే ఓట్స్​ని టేస్టీగా మార్చే ఓ రెసిపీతో మీ ఉదయాన్ని స్టార్ట్ చేసేయండి.
ఓట్స్ పొంగనాలు
ఓట్స్ పొంగనాలు

ఓట్స్ పొంగనాలు

Oats Ponganalu Recipe : పొంగనాలు సాధారణంగా దోశ పిండితో చేస్తారు. ఇది దక్షిణ భారతీయ చిరుతిండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వీటిని బాగా ఇష్టంగా తింటారు. దీనిని మినపప్పు, బియ్యం పిండితో తయారు చేస్తారు. అయితే ఫర్ ఏ ఛేంజ్.. మీ ఆరోగ్యాన్ని మరింత రెట్టింపు చేసే.. ఓట్స్​ పొంగనాల గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వీటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్ పొంగనాలు

* ఓట్స్ - 1/2 కప్పు

* మినపప్పు - 1/2 కప్పు

* ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి)

* క్యాప్సికం - 1 (సన్నగా తరగాలి)

* క్యారెట్ - 1 (సన్నగా తరగాలి)

* పచ్చిమిర్చి - 1/2 టీస్పూన్ (తరిగిన ముక్కలు)

* పెప్పర్ - చిటికెడు

* సాల్ట్ - సరిపడినంత

ఓట్స్ పొంగనాలు తయారీ విధానం

నానబెట్టిన మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. దానిలో ఉప్పు, పచ్చిమిర్చి, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. ఉల్లిపాయ, క్యారెట్ తురుము, క్యాప్సికమ్, ఓట్స్‌ వేసి బాగా కలపాలి. పది నిముషాలు పక్కన పెట్టేయండి.

ఇప్పుడు పొంగనాల మేకర్ తీసుకుని.. దానికి నెయ్యి లేదా నూనె రాయండి. గుంటల్లో సిద్ధం చేసుకున్న ఓట్స్ మిశ్రమాన్ని వేయండి. మూతవేసి సన్నని మంటపై వాటిని ఉడకించాలి. అనంతరం వాటిని ఫ్లిప్ చేసి మరో వైపు నుంచి ఉడికించాలి. బ్రౌన్ రంగు వచ్చిన తర్వాత వాటిని తీసి హ్యాపీగా లాగించేయండి. చట్నీ ఉన్నా.. లేకున్నా.. నేరుగా తినేందుకు కూడా ఇవి బాగానే ఉంటాయి. వేడి వేడి ఛాయ్​కి కూడా ఇవి మంచి కాంబినేషన్.

టాపిక్