తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Dahi Kebabs Recipe : వీకెండ్ స్పెషల్ ఓట్స్ దహీ కబాబ్.. సింపుల్ రెసిపీ..​

Oats Dahi Kebabs Recipe : వీకెండ్ స్పెషల్ ఓట్స్ దహీ కబాబ్.. సింపుల్ రెసిపీ..​

12 November 2022, 7:08 IST

google News
    • Oats Dahi Kebabs Recipe : మీ వీకెండ్​ని మంచి డిష్​తో మొదలు పెట్టాలనుకుంటున్నారా? అయితే మీరు ఓట్స్ దహీ కబాబ్స్ ట్రై చేయవచ్చు. పైగా ఇవి పూర్తిగా వెజ్​. అంతేకాకుండా వీటికి హెల్త్ టచ్​ ఇస్తూ.. రెసిపీని మరింత ఎంజాయ్ చేయవచ్చు. మరి వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
ఓట్స్ దహీ కే కబాబ్
ఓట్స్ దహీ కే కబాబ్

ఓట్స్ దహీ కే కబాబ్

Oats Dahi Kebabs Recipe : ఓట్స్ దహీ కబాబ్స్ చేయడం చాలా సింపుల్. కబాబ్స్ అనగానే ఎక్కువ సేపు కిచెన్​లో కష్టపడిపోవాలేమో అని ఆలోచించేవారు.. తమ ఆలోచనలు పక్కన పెట్టేయొచ్చు. వీటిని రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారు చేయడం చాలా సింపుల్. అంతేకాకుండా మీ వీకెండ్​కి ఇవి మంచి స్నాక్ అవుతాయి. వీటిని బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. స్నాక్​లా తీసుకోవచ్చు. చల్లని సాయంత్రంలో ఛాయ్​కి దోస్తీగా తీసుకోవ్చచు. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు కాబట్టి.. మీరు వీటిని తయారు చేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో.. తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* పెరుగు - 1 కప్పు

* ఓట్స్ పౌడర్ - 3/4 కప్పు

* పెప్పర్ పౌడర్ - రుచికి తగినంత

* కారం - 2 టేబుల్ స్పూన్స్

* గరం మసాలా - 1 స్పూన్

* ఉప్పు - తగినంత

* కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్స్ (తురిమినది)

* పనీర్ - 1 కప్పు (తురిమినది)

* ఎండు ద్రాక్ష - 3 స్పూన్స్ (వేయించినవి)

* జీడిపప్పు - 5 స్పూన్స్ (వేయించినవి)

తయారీ విధానం

ఓ గిన్నెలో పెరుగు తీసుకుని.. దానిలో ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఓట్స్ పౌడర్ వేసి మళ్లీ కలపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం మరో గిన్నె తీసుకుని.. దానిలో ఎండుద్రాక్ష, జీడిపప్పు, తురిమిన పనీర్, చాట్ మసాలా, చిటికెడు పంచదార, గరం మసాలాతో పాటు ఉప్పు కలిపి.. పిండి చేయండి.

ముందు రెడీ చేసుకున్న మిశ్రమం, ఇప్పుడు తయారు చేసుకున్న స్టఫింగ్ పిండితో కబాబ్ రోల్ చేయండి. పిండి బయటకు రాని విధంగా రోల్ చేయండి. ఇప్పుడు వాటిని గోధుమ రంగు వచ్చే వరకు నూనెలో డీప్ ఫ్రై చేయండి. అవి వేగిన తర్వాత.. పైన కొంచెం చాట్ మసాలా చల్లి.. వేడి వేడి ఓట్స్ దహీ కబాబ్‌లను పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే.. ఆహా అంటూ లాగించేస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం