Bread Pakodi | చల్లని ఉదయానికి గొప్ప స్టార్ట్.. బ్రెడ్ పకోడితో బ్రేక్‌ఫాస్ట్!-start your sunday morning with lip smacking bread pakodi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bread Pakodi | చల్లని ఉదయానికి గొప్ప స్టార్ట్.. బ్రెడ్ పకోడితో బ్రేక్‌ఫాస్ట్!

Bread Pakodi | చల్లని ఉదయానికి గొప్ప స్టార్ట్.. బ్రెడ్ పకోడితో బ్రేక్‌ఫాస్ట్!

HT Telugu Desk HT Telugu
Jun 12, 2022 09:31 AM IST

ఆదివారం మధ్యాహ్నం కోడి కూర ఎలాగూ తింటారు. మరి బ్రేక్‌ఫాస్ట్ కోసం బ్రెడ్ పకోడి తిని చూడండి. ఎలా చేసుకోవాలో రెసిపీ ఇక్కడ చూడండి.

Bread Pakodi
Bread Pakodi (Unsplash )

మాన్‌సూన్ రాకతో చాలా చోట్ల వాతావరణం చల్లబడింది. ఇదివరకులా కాకుండా ఇప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గి ఉదయం పూట మరింత చల్లగా ఉంటోంది. మాన్‌సూన్ సీజన్‌లో పకోడి తినడం చాలా మందికి ఫేవరెట్‌గా ఉంటుంది. అయితే ఇందులోనే ఇంకొంచెం వెరైటీగా బ్రెడ్‌‌ తో కలిపి పకోడిలా చేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది, బ్రేక్ ఫాస్ట్ చేసినట్లూ అవుతుంది. ఈ చల్లటి ఉదయాన వేడివేడి బ్రెడ్ పకోడి మీ సండేను ఫన్ డేగా మారుస్తుంది.

ఈ బ్రెడ్ పకోడిని చేసుకోవడం చాలా సులభం. మనకు సాధారణంగా పకోడి కోసం ఏ పదార్థాలైతే అవసరం అవుతాయో దాదాపు అవే ఈ రెసిపీకి కూడా అవసరం అవుతాయి. అయితే బ్రెడ్ పకోడి కోసం ఉల్లిపాయలకు బదులుగా కొన్ని బ్రెడ్ ముక్కలు, ఆలు గడ్డలు ఉంటే చాలు. ఇంకా ఆలస్యం చేయకుండా మరోసారి బ్రెడ్ పకోడి కోసం ఏమేం కావాలో, ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

బ్రెడ్ పకోడి కోసం కావాల్సిన పదార్థాలు

  • 12 బ్రెడ్ ముక్కలు
  • 85 గ్రాముల శనగ పిండి
  • 1 టీస్పూన్ వాము
  • 1 టీస్పూన్ కారం
  • 1/2 టీస్పూన్ పసుపు
  • ఉప్పు రుచికి తగినంత
  • అవసరం మేరకు నీరు

స్టఫ్ చేసేందుకు ప్రత్యేకంగా

  • 3 పెద్ద సైజు బంగాళదుంపలు
  • 2.5 టీస్పూన్లు అల్లం పేస్ట్
  • 3 వెల్లుల్లి రెబ్బలు, తరిగినవి
  • 2 టీస్పూన్ల కారం
  • 3 పచ్చిమిర్చి, తరిగినవి
  • 4 టీస్పూన్లు తాజా కొత్తిమీర
  • 2.5 టీస్పూన్ల ధనియాల పొడి
  • 2 టీస్పూన్ల జీలకర్ర పొడి
  • 2.4 టీస్పూన్ల ఆమ్చూర్
  • రుచికి తగినంత ఉప్పు
  • పకోడి వేపుడు కోసం తగినంత నూనె

తయారీ విధానం

  1. బౌల్‌లో శనగపిండి, వాము, కారం, పసుపు, ఉప్పు వేసి క్రమంగా నీరు పోస్తూ అన్నింటినీ కలపండి. మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా సన్నని బ్యాటర్ తయారుచేసుకోండి.
  2. మరోవైపు ఇంకొక కటోరీలో మెత్తని ఉడికించిన బంగాళదుంపలు, అల్లం పేస్ట్, తరిగిన వెల్లుల్లి, కారం పొడి, తరిగిన పచ్చిమిర్చి, తాజా కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్‌చూర్, ఉప్పు వేసి అన్నింటినీ ముద్దగా కలపండి.
  3. పకోడి డీప్ ఫ్రై కోసం కడాయిలో తగినంత నూనె వేడి చేయండి.
  4. ఇప్పుడు రెండు బ్రెడ్ ముక్కల మధ్య బంగాళదుంపల మిశ్రమాన్ని ఉంచండి. ఈ బ్రెడ్ ముక్కలను సన్నటి శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేయించండి.
  5. పకోడీ రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి.
  6. వేయించిన పకోడిలను త్రికోణాకృతిలో కట్ చేసుకొని సర్వింగ్ బ్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.

ఈ బ్రెడ్ పకోడితో అల్లం చాయ్, లేదా లెమన్ చాయ్ లేదా ఐస్ టీ మంచి కాంబినేషన్ అవుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్