Masala Cheese Toast Recipe : సింపుల్ & టేస్టీ రెసిపీ.. మసాలా చీజ్ టోస్ట్
17 November 2022, 6:41 IST
- Masala Cheese Toast Recipe : బ్రెడ్ టోస్ట్ వినే ఉంటారు. చాలామంది దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. కానీ ఈ టోస్ట్ని మరింత క్రేజీగా మార్చే ఓ రెసిపీ ఇక్కడ ఉంది. అదే మసాలా చీజ్ టోస్ట్. దీనిని తయారు చేయడానికి గంటలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. పైగా ఇది టేస్టీ అండే హెల్తీ కూడా.
మసాలా చీజ్ టోస్ట్
Masala Cheese Toast Recipe : ఉదయాన్నే కాస్త టేస్టీగా, సింపుల్‌గా, హెల్తీగా చేసుకోగలిగే బ్రేక్‌ఫాస్ట్ ఉంటే చాలా బాగుంటుంది. మీ లేజీ డేని కూడా టేస్టీగా మార్చుకోగలిగే ఓ రెసిపీ ఇక్కడ ఉంది. అదే మసాలా చీజ్ టోస్ట్. దీనిని తయారు చేయడం చాలా సింపుల్. అంతేకాకుండా ఇది ప్రతి బైట్‌లో మీకు టేస్ట్‌ని ఇస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* ఉల్లిపాయ - 1 (తరిగినది)
* క్యాప్సికమ్ - 1
* క్యారెట్ - 1
* కారం - 1/2 tsp
* పెప్పర్ - రుచికి తగినంత
* సాల్ట్ - రుచికి తగినంత
* ధనియపొడి - 1/2 tsp
* బ్రెడ్ - 4 ముక్కలు
* చీజ్ - 2
తయారీ విధానం
ఓ డిష్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చేయాలి. దానిలో తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యారెట్ వేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత.. దానిలో కారం, పెప్పర్, ధనియాల పొడి, ఉప్పు వేసి.. బాగా కలపండి. ఈ కూరగాయలు మెత్తబడేవరకు ఉడికించాలి.
ఇప్పుడు బ్రెడ్ ముక్కలను తీసుకుని.. వాటిని ఒకవైపు లైట్‌గా రోస్ట్ చేయండి. అనంతరం వాటిపై మనం తయారు చేసుకున్న వెజిటెబుల్ మిశ్రమాన్ని ప్లేస్ చేయండి. ఇప్పుడు దానిపై చీజ్ పెట్టండి. ఇప్పుడు వాటిని బాగా టోస్ట్ చేయండి. చీజ్ కరిగిపోతుంది. అంతే వేడి వేడి మసాలా చీజ్ టోస్ట్ రెడీ. దీనిని సర్వ్ చేసుకుని.. ఇలాగే లాగించేవచ్చు లేదా.. టమాటో కెచప్‌తో ఆస్వాదించేయవచ్చు. వెచ్చని టీ తో కూడా తినొచ్చు.