తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Benefits Of Olives : ఈ ఒక్కటి తింటే చాలు.. గుండె పదిలం.. ఆర్థరైటిస్ నయం..

Health Benefits of Olives : ఈ ఒక్కటి తింటే చాలు.. గుండె పదిలం.. ఆర్థరైటిస్ నయం..

29 November 2022, 19:23 IST

    • Health Benefits of Olives : కొందరు పిజ్జా టాపింగ్​పై ఉండే ఆలివ్​లను తీసి మరి పక్కన పెట్టేస్తారు. దానిలోని పోషకవిలువలు తెలిస్తే మీరు వాటిని ఎప్పటికీ పక్కన పెట్టరు. మెరుగైన గుండె పనితీరు కావాలన్నా.. ఎముకలు దృఢంగా ఉండాలన్నా.. ఆకలిని తగ్గించడానికైనా.. ఆర్థరైటిస్​ని జయించడానికైనా.. ఆలివ్​లకు అడ్డే లేదు అంటున్నారు నిపుణులు.
ఆలివ్ బెనిఫిట్స్
ఆలివ్ బెనిఫిట్స్

ఆలివ్ బెనిఫిట్స్

Health Benefits of Olives : గుండె పనితీరు నుంచి ఎముకల ఆరోగ్యం వరకు.. పోషకాలతో నిండిన ఆలివ్​లు ఎంతో ప్రభావం చూపిస్తాయి అంటున్నారు నిపుణులు. ఇవి రుచికరమైనవి. అంతేకాకుండా వివిధ పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి నలుపు, ఆకుపచ్చని రంగులలో లభ్యమవుతాయి. అయితే ఆలివ్​, ఆలివ్ నూనెను డైట్​లో చేర్చుకోవడం వల్ల వివిధ బెనిఫిట్లను పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏమిటో.. ఎందుకు వీటిని డైట్​లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికై..

ఒలేయిక్ యాసిడ్ అనే లాభదాయకమైన మోనో-అసంతృప్త రకాల కొవ్వుతో ఆలివ్‌లు పుష్కలంగా నిండి ఉంటాయి. ఈ సమ్మేళనం కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంతో పాటు.. రక్తపోటును సాధారణ స్థాయికి తీసుకువస్తాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

అంతేకాకుండా అనేక అధ్యయనాలు.. ఆలివ్ నూనెను తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిరూపించాయి.

ఎముకల ఆరోగ్యానికై..

30 ఏళ్లు దాటిన తర్వాత స్త్రీలు ఎముకల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పురుషులు సైతం ఎముకల ఆరోగ్యానికై.. ఆలివ్ నూనె తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలోని ముఖ్యమైన పోషకాలు ఎముకల నష్టాన్ని నిరోధించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాలు తేల్చాయి.

వాస్తవానికి మెడిటరేనియన్ డైట్‌ని అనుసరించే వారికి ఎముకలకు సంబంధించిన ఏదైనా ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు తగ్గుతాయని కనుగొన్నారు. ఆలివ్, ఆలివ్ నూనె ఎముక-రక్షిత ఏజెంట్లుగా పనిచేస్తాయి.

క్యాన్సర్‌ నివారణకై..

పాశ్చాత్య దేశాల కంటే మధ్యధరా సముద్రంలోని దేశాలలో క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల అవకాశాలు తక్కువగా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

ఎందుకంటే అక్కడివారు తమ ఆహారంలో ఆలివ్ లేదా ఆలివ్ ఆయిల్ పుష్కలంగా ఉంటుంది. వీటిలో యాంటీఆక్సిడెంట్, ఒలీక్ యాసిడ్ కంటెంట్‌లు పుష్కలంగా ఉంటాయి.

ఈ రెండు సమ్మేళనాలు పెద్దపేగు, రొమ్ము, కడుపులోని క్యాన్సర్ కణాల జీవితచక్రానికి అంతరాయం కలిగించడంలో సహాయపడతాయని సైన్స్ చెబుతోంది.

ఆకలి నియంత్రణకై..

ఆలివ్‌లు డైటరీ ఫైబర్​కు శక్తివంతమైన మూలం. ఇది అనారోగ్యకరమైన చిరుతిళ్లను నిరోధిస్తుంది. ఆహార కోరికలను దూరంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండిన కొన్ని ఆలివ్‌లను తీసుకుంటే.. మీ ఆకలి కంట్రోల్​లో ఉంటుంది.

అంతేకాకుండా ఇవి మెరుగైన జీర్ణక్రియను అందిస్తాయి. కోలిసిస్టోకినిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తాయి. ఇవి మనస్సులో సంపూర్ణత, సంతృప్తి సందేశాలను ప్రేరేపిస్తాయి. తద్వార మీరు తక్కువగా తింటారు.

ఆర్థరైటిస్​ను అధిగమించడానికై..

ఆలివ్‌లు బలమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో దీర్ఘకాలిక మంటలను నయం చేయడంలో సహాయపడతాయి.

హైడ్రాక్సీటైరోసోల్, ఒలియానోలిక్ యాసిడ్.. ఈ రెండు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు. ఇవి వాపును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. మీ ఆహారంలో ఆలివ్‌లను చేర్చుకోవడం ద్వారా.. మీరు సోరియాసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధుల లక్షణాలను సులభంగా అధిగమించవచ్చు.

తదుపరి వ్యాసం