తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Olive Ridley Turtles : ఆలీవ్ రిడ్లే తాబేళ్లు.. 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. పుట్టిన చోటే సంతానోత్పత్తి

Olive Ridley Turtles : ఆలీవ్ రిడ్లే తాబేళ్లు.. 20 వేల కిలోమీటర్లు ప్రయాణించి.. పుట్టిన చోటే సంతానోత్పత్తి

Anand Sai HT Telugu

21 July 2022, 14:51 IST

    • సంతానోత్పత్తి కోసం సైబీరియా పక్షులు వలస రావడం చూస్తుంటాం. వాటి మాదిరే కొన్ని జాతుల తాబేళ్లు సైతం వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి. వాటికి అలుపేలేదు. గమ్యం చేరడమే వాటి లక్ష్యం. అలా తూర్పు తీరానికి చేరుకుంటాయి. కేవలం సంతానోత్పత్తి కోసమే.. వాటి ప్రయాణం ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

వాటికి అలసట అంటే తెలియదు. భారీగా ఉన్నా.. ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అనుకున్న ప్రదేశానికి వచ్చే వరకూ.. ఎక్కడా వెనక్కు తగ్గవు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. పుట్టింటి దగ్గరకు వచ్చినట్టుగా వస్తాయి. ఆ తర్వాత సంతోనత్పత్తి అయ్యాక.. ఎంచక్కా వెళ్లిపోతాయి. అవే ఆలీవ్ రిడ్లే తాబేళ్లు. ఆ జీవుల్లో ఎన్నో ప్రత్యేకతలు. శ్రీకాకుళం తీర ప్రాంతానికి సైతం వస్తుంటాయి. అయితే వాటికి అక్కడ రక్షణ చర్యలు ఎలా ఉన్నాయి?

ట్రెండింగ్ వార్తలు

TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

AP POLYCET Results 2024 : ఇవాళ ఏపీ పాలిసెట్ 'ఫైనల్ కీ' - ఫలితాలు ఎప్పుడంటే..?

AP Weather : రేపు 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మంగళవారం భారీ వర్షాలు

Coringa Wildlife Sanctuary : మడ అడవుల్లో బోటింగ్, ప్రకృతి అద్భుతాలు- ఈ సమ్మర్ లో కోరింగ అందాలు చూసేయండి!

ఉభయచర జీవుల్లో తాబేళ్లకు ప్రత్యేక స్థానం. అందులోనూ ఆలీవ్ రిడ్లే తాబేళ్లంటే.. మరీ ప్రత్యేకం. వాటికి ఎక్కడా స్థిర నివాసం ఉండదు. ఎక్కడకు వెళితే.. ఆ రోజుకు వాటికే అదే స్థిర నివాసం. ఆలీవ్ రిడ్లే తాబేళ్లు.. రెండడుగుల పొడవు, దాదాపు 500 కేజీల బరువు వరకూ ఉంటాయి. ఇవి.. ఆహారం కోసం, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి గురించి సుమారుగా.. 20 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి.

ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ మరియు ఇతర దేశాల నుంచి.. హిందూ మహాసముద్రం ద్వారా ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ఏపీ, ఒడిశా తీరప్రాంతాలకు చేరుకుంటాయి. లక్షలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో తీరాలకు చేరుకుంటాయి. ఇసుకలో గోతులు తవ్వుతాయి. వాటిల్లో గుడ్లు పెట్టేసి.. ఇసుక కప్పి, సముద్రంలోకి వెళ్లిపోతాయి. అయితే నెల రోజుల తర్వాత.. ఈ గుడ్లు పిల్లలు అవుతాయి. ఒక్క తాబేలు 50 నుంచి 150 వరకూ గుడ్లు పెట్టే అవకాశం ఉంది. తగినంత ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు పిల్ల తాబేళ్లు అవుతాయి. అనంతరం సముద్రంలోకి వెళ్లిపోతాయి.

ఈ సముద్రపు జీవుల బతుకంతా.. సముద్రంలోనే అయినా.. గుడ్లు పెట్టేందుకు.. భూమి మీదకు వస్తాయి. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోట పిల్లలు తయారవుతాయి. అయితే అవే.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో పుట్టిన చోటుకే వస్తాయి. మళ్లీ అక్కడే గుడ్లు పెట్టడం ఆశ్చర్యకరం. ఇలా పుట్టిన చోటే.. గుడ్లు పెట్టే జీవి ఆలీవ్ రిడ్లే తాబేలు మాత్రమే.

ఈ సముద్రపు తాబేలుకు రక్షణ చర్యలు లేకపోవడంతో శ్రీకాకుళం తీరంలో వాటి మనుగడకు ముప్పులు ఎదురవుతున్నాయి. మత్స్యకారుల వలలు, పడవలు, తీరప్రాంత కాలుష్యం కారణంగా గుడ్లు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. కుక్కలు, తోడేళ్లు కూడా సముద్ర తీర ప్రాంతంలో తాబేలు గుడ్లను తింటాయి. శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో తాబేళ్లు, వాటి గుడ్లను కాపాడేందుకు సరైన రక్షణ చర్యలు చేపట్టడంలో అటవీ, మత్స్యశాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

'ప్రభుత్వం సముద్ర తీర ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలి. తాబేళ్ల ప్రాముఖ్యత, వాటి సంరక్షణ బాధ్యతపై అధికారులు అవగాహన కల్పించాలి. తాబేళ్ల గుడ్లను రక్షించేందుకు స్థానికుల సహకారం తీసుకుంటున్నాం. గుడ్లను పొదిగిన ప్రదేశాలకు ప్రత్యేక జోన్‌ అవసరం.' అని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి కె.రవి చెప్పారు.