తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Potato Uthappam Here Is The Ingredients And Recipes

Breakfast Recipe : బంగాళదుంపతో చేసే ఉతప్పం.. తింటే మీకు తృప్తి ఖాయం

11 August 2022, 8:41 IST

    • Potato Uthappam : టిఫెన్స్​లో ఉతప్పానికి ఉండే క్రేజే వేరు. అయితే రోటీన్ ఉతప్పానికి బాయ్ చెప్పి.. బంగాళదుంపతో చేసే ఉతప్పాన్ని ట్రై చేయండి. కొన్ని కూరగాయాలు కూడా ఈ ఉతప్పాంలో ఉపయోగిస్తాము కాబట్టి.. అవి మీ టేస్ట్​ను మరింత పెంచుతాయి. ఒక్కసారి తింటే.. మళ్లీ మళ్లీ అదే కావాలి అనేంతలా ఉంటుంది దాని టేస్ట్.
బంగాళదుంప ఉతప్పం
బంగాళదుంప ఉతప్పం

బంగాళదుంప ఉతప్పం

Potato Uthappam : ఉదయాన్నే టేస్టీ బ్రేక్​ఫాస్ట్​తో రోజును ప్రారంభిస్తే అబ్బబ్బా. ఆ ఊహ ఎంత బాగుంది. పైగా మన అల్పాహారాన్ని మంచి వేడి వేడి ఉతప్పంతో లాగిస్తే.. ఇంక మాటలేమి ఉంటాయి గురువు గారు. అయితే బంగాళదుంపతో తయారు చేసే ఉతప్పానికి కూడా అంతే క్రేజ్ ఉందంటే నమ్ముతారా? పైగా ఇది మీకు మరింత ఎక్కువ టేస్ట్​ని ఇస్తుంది. ఆలు పిండికి మంచి ఆకృతిని ఇస్తుంది. కూరగాయలు ఉతప్పం రుచిని మరింత మెరుగ్గా చేస్తాయి. దీనిని సాంబార్​ లేదా చట్నీతో కూడా హాయిగా లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

కావాల్సిన పదార్థాలు

* బియ్యం - 1 కప్పు

* బంగాళదుంపలు - 2 (ఉడికించినవి)

* ఉల్లిపాయ - 1 (తరిగినది)

* క్యారెట్ - 1(తరిగినది)

* క్యాబేజి - కొంచెం (తరిగినది)

* క్యాప్సికమ్ - 1 (తరిగినది)

* పచ్చిమిర్చి - 1 (తరగాలి)

* అల్లం - 1 స్పూన్ (తరగినది)

* కారం - 1 స్పూన్

* ఉప్పు - తగినంత

తయారీవిధానం

ఆలూ ఉతప్పం చేయడానికి ముందుగా బియ్యాన్ని ఐదు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని, ఉడకబెట్టిన బంగాళాదుంపలను, అల్లం, పచ్చి మిరపకాయలను బ్లెండర్‌లో వేసి మిక్సి చేయాలి. నీరు పడితే కాస్త వేయండి. అది పిండిలాగా సిద్ధమైనప్పుడు దానిని పెద్ద గిన్నెలోకి మార్చండి.

ఆ మిశ్రమంలో క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయలను వేయండి, కారం, ఉప్పు వేసి మరోసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై దోశ పాన్​ ఉంచండి. అది వేడైన తర్వాత.. పిండిని ఉతప్పంలా వేసుకోవాలి. రెండువైపులా మంచి గోల్డెన్ రంగు వచ్చేవరకు కాల్చి.. మంచి చట్నీతో లాగిస్తే.. ఆహా అనేస్తారు.

టాపిక్