Breakfast Recipe : ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ కావాలనుకుంటే.. స్ట్రాబెర్రీ స్మూతీ తాగండి
10 August 2022, 7:28 IST
- Strawberry Smoothie : జిమ్‌కి లేదా వ్యాయామాలు చేసేవారు ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకునేందుకు ప్రిఫర్ చేస్తారు. అయితే జిమ్‌లో కసరత్తులు చేసి ఇంటికి వచ్చాక.. ప్రొటీన్ తీసుకోవాలి అనుకునేవారు ఈ స్ట్రాబెర్రీ స్మూతీని ట్రై చేయాలి. దీనిని తయారు చేయడం సులభమే. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది.
స్ట్రాబెర్రీ స్మూతీ
Strawberry Smoothie : మీరు తక్కువ సమయంలో రుచికరమైన, ప్రొటీన్‌తో కూడిన రెసిపీని ట్రై చేయాలనుకుంటే.. మీరు హ్యాపీగా స్ట్రాబెర్రీ స్మూతీని ప్రయత్నించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం కూడా. ఈ స్మూతీ పైనాపిల్, బాదం పాలు, స్ట్రాబెర్రీ, ప్రొటీన్‌తో కలిపి తయారు చేస్తారు. పైగా దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఈ ప్రొటీన్ స్మూతీ తయారికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* పైనాపిల్ - 2 స్లైసెస్
* స్ట్రాబెర్రీస్ - 3-4
* స్కిమ్డ్ లేదా బాదం పాలు - 1 గ్లాస్
* ఎండుద్రాక్ష - 5 (నానబెట్టినవి)
* ప్రొటీన్ - 1 స్కూప్
* ఐస్ క్యూబ్స్ - 3-4
స్ట్రా ప్రోటీన్ స్మూతీ తయారీ విధానం..
బ్లెండర్లో పైనాపిల్, స్ట్రాబెర్రీస్, బాదంపాలు, ఎండుద్రాక్ష, ప్రొటీన్, ఐస్ క్యూబ్స్ వేసి.. బాగా బ్లెండ్ చేయాలి. ఇవి మంచి స్మూతీగా అయ్యేవరకు బ్లెండ్ చేస్తూనే ఉండాలి. అనంతరం దీనిని ఓ గ్లాసులో సర్వ్ చేసి.. హ్యాపీగా లాగించేయండి. టేస్ట్‌కి టేస్ట్.. ఆరోగ్యానికి ఆరోగ్యం.