Breakfast Recipe : పూజకు ఉపయోగించిన కొబ్బరితో.. సింపుల్గా బర్ఫీ చేసేయండి
06 August 2022, 8:00 IST
- Breakfast Recipe : నిన్ననే వరలక్ష్మీ వ్రతం అయిపోయింది. సాధారణంగా పూజలో ఉపయోగించిన కొబ్బరితో ఇంట్లో ఏదొఒకటి చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ కొబ్బరితో.. లేదా కొత్తగా కొబ్బరితో ఏమైనా చేయాలనుకుంటే కొబ్బరి బర్ఫీని ట్రై చేయండి.
కొబ్బరి బర్ఫీ
Breakfast Recipe : పూజలో ఉపయోగించిన కొబ్బరితో అమ్మలు, అమ్మమ్మలు చట్నీలు, స్వీట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఈసారి వాటికి బదులుగా కొబ్బరి బర్ఫీని చేసుకోండి. ఇది మీకు రుచికి రుచిని ఇస్తుంది. మీరు కొబ్బరితో చేసే రోటీన్ వంటలకు బ్రేక్ ఇస్తుంది. మరి ఈ కొబ్బరి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో.. ఏమి పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
* పంచదార - 1 కప్పు
* నీరు - 1 కప్పు
* తాజాగా తురిమిన కొబ్బరి - 11/2 కప్పు
* యాలకులు పొడి - 1 స్పూన్
* బాదం - 4,5 (తరిగి పెట్టుకోవాలి)
* పిస్తా - 6,7
* నెయ్యి - 1 స్పూన్
* పాలకోవా - 1 స్పూన్
కొబ్బరి బర్ఫీ తయారీ విధానం
స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి.. నీటిని పోసి.. దానిలో చక్కెర వేయాలి. అది పూర్తిగా నీటిలో కరిగించి షుగర్ సిరప్ తయారు చేయాలి. ఇది కొద్దిగా చిక్కగా అయ్యేలా చూడండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. స్టవ్ సిమ్లో ఉంచాలి. దీనిలో పాలకోవా, ఏలకుల పొడి వేసి బాగా కలపి దించేయాలి.
ఇప్పుడు ట్రేలో కొద్దిగా నెయ్యి రాసి.. ఈ కొబ్బరి మిశ్రమాన్ని దానిలో వేసి.. సమానంగా పరచాలి. దాని మీదు తరిగిన డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలు ఫ్రిజ్లో ఉంచండి. అనంతం దానిని బయటకు తీసి.. మీకు నచ్చిన షేప్లలో కట్చేసుకుని లాగించేయండి. చూశారా కొబ్బరి బర్ఫీ చేయడం ఎంత సులువో.