తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kalakand Recipe : కలాకండ్ చేసేయండి.. దేవుడికి నైవేద్యంగా పెట్టేయండి..

Kalakand Recipe : కలాకండ్ చేసేయండి.. దేవుడికి నైవేద్యంగా పెట్టేయండి..

09 August 2022, 9:11 IST

google News
    • Kalakand Recipe : ప్రతి ఇంట్లో ఉదయాన్నే వంటగదిలో అజామాయిషీ చూపించేది పాలు. ఈ పాలతో టీ, కాఫీ వంటివి పెట్టుకుని డే స్టార్ చేస్తాము. అయితే అవే పాలను ఉపయోగించి పలు వంటలు కూడా చేస్తాము. రోటీన్​ స్వీట్​లకు బ్రేక్​ ఇచ్చి.. కొత్తగా తినాలనుకునేవారు.. కలాకండ్ ట్రై చేయవచ్చు.
కలాకండ్
కలాకండ్

కలాకండ్

Kalakand Recipe : పండుగలొచ్చినా.. ఇంట్లో పూజలు చేసినా.. ఏదొక నైవేధ్యంగా స్వీట్స్ వండుతూనే ఉంటాము. అయితే ఎక్కువగా పాయసం, పరవన్నం, సేమ్యా, పులిహోర వంటివి వండుతూ ఉంటాము. అయితే వాటికి బ్రేక్ ఇచ్చి.. కలాకండ్ కూడా తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని చాలా సింపుల్​గా తక్కువ పదార్థాలతోనే వండేయవచ్చు. మరి కలాకండ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* మిల్క్ - 250 Ml

* కాటేజ్ చీజ్ - 250 గ్రాములు

* చక్కెర - 120 గ్రాములు (పొడి చేసుకోవాలి)

* రోజ్ వాటర్ - 1 టీ స్పూన్

* ఏలకుల పొడి - అర టీస్పూన్

* కలాకండ్బాదంపప్పు - 5 (తరగాలి)

కలాకండ్ తయారీ విధానం

పాలు, కాటేజ్ చీజ్ ఓ గిన్నెలో తీసుకుని.. మిగిలిన ద్రవం ఆరిపోయే వరకు ఉడికించాలి. దానిలో పంచదార పొడి వేసి.. మరికొంత ఉడికించాలి. అదనపు ద్రవం లేకుండా చూసుకోవాలి. కానీ మిశ్రమం కాస్త తడిగా ఉండేలా చూసుకోవాలి. స్టవ్ ఆపేసి.. దానిలో రోజ్ వాటర్, యాలకుల పొడి వేయాలి.

ఈ మిశ్రమాన్ని అచ్చు లేదా సర్వింగ్ డిష్‌కు బదిలీ చేయాలి. దానిని సమానంగా సెట్ చేయాలి. అనంతరం దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చివరిగా బాదంపప్పుతో గార్నిష్ చేసి.. లాగించేయడమే. రూమ్ టెంపరేచర్​లో తిన్నా.. ఇది బాగుంటుంది.

టాపిక్

తదుపరి వ్యాసం