Breakfast Recipe : శుభకార్యమైనా.. పుట్టినరోజైనా.. సేమ్యాకే అందరి ఓటు..
Breakfast Recipe : పుట్టినరోజు అయినా.. పండుగలైనా.. ఇంట్లో సేమ్యా చేయాల్సిందే. నోరూరించే రుచికరమైన వంటకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని నైవేద్యంగాను పెట్టొచ్చు. ఉదయాన్నే మీ ఖాళీ కడుపులో కూడా వెయొచ్చు. మరి సేమ్యాను టేస్టీగా ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Breakfast Recipe : దాదాపు అన్ని ఇళ్లల్లో సేమ్యా చేస్తారు. ఏ పండుగకు, శుభకార్యానికి స్వీట్ కావాలన్నా ఇదే ముందుంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. గంటలు గంటలు కుస్తీ పడి దీనిని చేయనవసరం లేదు. చాలా సింపుల్‌గా.. తక్కువ పదార్థాలతో దీనిని తయారుచేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* సేమ్యాలు - 70 గ్రాములు
* నెయ్యి - 25 గ్రాములు
* పాలు - 400 మి.లీ
* చక్కెర - 50 గ్రాములు (బెల్లం కూడా వేసుకోవచ్చు)
* యాలకులు - 3 (పొడి చేయాలి)
* బాదం పప్పులు - 10 గ్రాములు
* ఎండుద్రాక్షలు - 10 గ్రాములు
* జీడిపప్పు - 10 గ్రాములు
తయారీ విధానం
కడాయి పెట్టి దానిలో నెయ్యి వేసి.. బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేయించి పక్కన పెట్టేయండి. మరికొంత నెయ్యి వేసి.. సేమ్యాను ఫ్రై చేయండి. అవి లేత గోధుమ రంగులోకి మారినాక.. పాలు వేసి మరిగించాలి. సేమ్యా ఉడుకుతుంది అనిపించినప్పుడు చక్కెర వేయాలి. అది కరిగి.. పాలు చిక్కబడే వరకు మంట చిన్నదిగా చేయాలి. దానిలో యాలకుల పొడివేసి దించేయాలి.
ఫ్రై చేసుకున్న డ్రైఫ్రూట్స్‌తో సేమ్యాను గార్నీష్ చేయాలి. ఇది చల్లగా ఉన్నప్పుడు తిన్నా.. వేడిగా తిన్నా బాగానే ఉంటుంది. చల్లారిన తర్వాత తినాలి అనుకునేవారు.. డ్రైఫ్రూట్స్‌ని తినే సమయంలో సేమ్యాలో వేసుకుంటే.. అవి క్రంచిగా మీకు మరింత టేస్ట్‌ని ఇస్తాయి. చిక్కగా కావాలి అనుకునే వారు ఇలా తినేయొచ్చు. లేదా కొన్ని పాలను కలిపి కూడా దీనిని తీసుకోవచ్చు.
సంబంధిత కథనం