తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Breakfast Recipe Is Korean Egg Roll Here Is The Making Process

Korean Egg Roll Recipe : ఈ కొరియన్ ఎగ్ రోల్.. మీ బ్రేక్​ఫాస్ట్​కు బెస్ట్ ఆప్షన్

07 September 2022, 7:50 IST

    • Korean Egg Roll : మీరు రుచికరమైన బ్రేక్​ఫాస్ట్​కోసం ఎదురుచూస్తున్నట్లయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. ముఖ్యంగా ఎగ్ రోల్ ఇష్టపడేవారికి ఈ కొరియన్ ఎగ్ రోల్ తప్పకుండా నచ్చుతుంది. పైగా దీనిని తయారు చేయడం చాలా సులభం. మీరు దీన్ని అల్పాహారంగా లేదా సైడ్ డిష్‌గా కూడా తీసుకోవచ్చు.
కొరియన్ ఎగ్ రోల్
కొరియన్ ఎగ్ రోల్

కొరియన్ ఎగ్ రోల్

Korean Egg Roll : కొరియన్ ఎగ్ రోల్​ను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇది చిన్నపిల్లలకు కూడా మంచి స్నాక్ అవుతుంది. వారికి కచ్చితంగా నచ్చుతుంది. పైగా పెద్దవారికి కూడా నచ్చుతుంది. కాబట్టి ఇంటిల్లిపాది హ్యాపీగా లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలి.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Moongdal Curry: పొట్టు పెసరపప్పుతో కూర వండితే అదిరిపోతుంది, వేడివేడి అన్నంలో టేస్టీగా ఉంటుంది

Pre Wedding Diet : పెళ్లికి ఒక వారం ముందు నివారించాల్సిన కొన్ని విషయాలు

Optical Illusion: ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో మేకల కాపరి ముఖం ఎక్కడుందో తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు

Chanakya Niti Telugu : ఈ సక్సెస్ సూత్రాలు మీ జీవితాన్నే మార్చేస్తాయి

కావాల్సిన పదార్థాలు

* గుడ్లు - 4

* పెప్పర్ - 1 స్పూన్ (చిన్న)

* ఉప్పు - తగినంత

* స్పింగ్ ఆనియన్ - 1

* క్యారెట్ - 1

* చీజ్ - కొంచెం

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలో మూడు నుంచి నాలుగు గుడ్లు పగలగొట్టి వాటిని బాగా కలపండి. దానిలో పెప్పర్, ఉప్పును వేసి మళ్లీ కలపండి. ఆ మిశ్రమానికి క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు పాన్ వేడి చేయండి. ఈ గుడ్డు మిశ్రమాన్ని పలుచని పొరగా వేయండి. అది ఉడకడం ప్రారంభించిన తర్వాత, కొంచెం చీజ్ వేసి.. గుడ్డును పాన్​లో మూలకు రోల్ చేయండి. మిగిలిన మిశ్రమంతో కూడా ఇలా చేయండి. అప్పుడు ప్రత్యేకమైన పొరలు ఉండే వరకు రోల్ ఉంటుంది. అది కాస్త చల్లార్చిన తర్వాత.. సన్నని ముక్కలుగా కట్ చేసి ఆస్వాదించేయండి.

టాపిక్