తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Quote : చోటి జిందగీ సైజ్ పెంచలేనిది.. కాబట్టి ఈరోజే దిల్ ఖుష్​గా ఉండండి

Thursday Quote : చోటి జిందగీ సైజ్ పెంచలేనిది.. కాబట్టి ఈరోజే దిల్ ఖుష్​గా ఉండండి

15 September 2022, 6:59 IST

    • Thursday Motivation : రేపటి కోసం కష్టపడుతూ ఈరోజు ఆనందాన్ని కోల్పోయే వాళ్లు చాలామందే ఉన్నారు. దాదాపు అందరూ అలానే ఉంటున్నారు. కానీ ఉన్నదే చిన్నలైఫ్. రేపు ఎలా ఉంటుందో తెలియని ఈ జీవితంలో రేపటి గురించి ఆలోచిస్తూ.. ఈరోజు సంతోషాలను దూరం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : ముందు జాగ్రత్త ఉండటంలో తప్పులేదు. రేపు కూడా సంతోషంగా ఉండాలనుకోవడంలో అస్సలు తప్పులేదు. దాని కోసం ఈరోజు కూడా కష్టపడాలి. కానీ కష్టపడటంతో పాటు ఈరోజు జీవించడం కూడా నేర్చుకోండి. రోజూ గొడ్డులాగా కష్టపడి.. ఆ అలసటతో తెలియకుండానే నిద్రపోయి.. మళ్లీ ఉదయాన్నే లేచి.. రేపటికోసం కష్టపడాలనే ఆవేశాన్ని కాస్త కంట్రోల్ చేసుకోండి.

రేపటి కోసం ఎంత శ్రద్ధ వహిస్తున్నారో.. ఈరోజు జీవించడం కూడా నేర్చుకోండి. ఎంత కష్టపడినా.. దానికి కాస్త లిమిట్​ పెట్టుకోండి. మీకోసం సమయం కేటాయించుకోండి. బ్రేక్ తీసుకోండి. లేదంటే రోజూ ఉదయాన్నే మీతో మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ప్యాంపర్ చేసుకోండి. మంచి ఫుడ్ తినండి. ఈరోజు కష్టపడేది రేపు బాగుండటం కోసమే కదా. మరి ఈరోజు బాగుంటేనే కదా రేపు బాగుండేది. పైగా ఈరోజు బాగుంటే రేపు ఇంకా బాగా కష్టపడొచ్చు. ఈ లాజిక్​ని ఎప్పుడు మిస్​కాకండి.

రేపు అనే రోజు మన చేతుల్లో ఉంటుందో లేదో చెప్పలేము. మన చేతుల్లో ఉన్నది ఈరోజు మాత్రమే. దానిని మాత్రం వదులుకోకండి. రేపటి కోసం పరుగెత్తడంలో బిజీగా ఉండి.. మీరు ఈరోజును కోల్పోతున్నారు. రేపనేది రావొచ్చు. రాలేకపోవచ్చు. కానీ ఈరోజు పోతే మళ్లీ రాదు. కష్టే ఫలి. కష్టపడండి. కానీ కాస్త బ్రేక్ తీసుకుంటే మీలో ఉత్సాహం మరింత పెరిగే అవకాశముంది. మీరు ఇంకా ఎక్కువగా.. ఎఫెక్టివ్​గా పని చేయవచ్చు. పైగా ఈరోజును కూడా ఎంజాయ్ చేసిన ఫీల్​ వస్తుంది. మన చేతుల్లో ఉన్న అవకాశాలను జారవిడుచుకుంటే దానిని మూర్ఖత్వమే అంటారు. ఆ పని చేయకండి. ఎందుకంటే తర్వాత ఎంత మొత్తుకున్న అవి మీకు దక్కకపోవచ్చు. అలాంటి వాటిల్లో ప్రెజెంట్ కూడా అంతే. ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాదు. కాబట్టి మన చేతుల్లో లేని రేపటి గురించి ఆలోచించి.. ప్రస్తుతాన్ని దూరం చేసుకోకండి. ఈరోజు కూడా సంతోషంగా ఉండేందుకు మీరు అర్హులని గుర్తించండి.

ఎప్పుడైనా.. పాస్ట్, ఫ్యూచర్.. ప్రెజెంట్​ మీద ఇంపాక్ట్ చూపించకుండా జాగ్రత్త తీసుకోండి. రేపేదో అయిపోతుందని.. ఈరోజును దూరం చేసుకోకండి. నచ్చింది తినండి. నచ్చిన వారితో మాట్లాడండి. ముఖ్యంగా మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. మీరు రిలాక్స్ అవ్వడానికో, సినిమా చూడడానికో, బయట తిరగడానికో.. ఇలా నచ్చినది ఏది చేసినా.. అది ఏదైనా సరే మీకోసం సమయం కేటాయించుకోండి. అదే మీకు మంచి రేపటిని అందిస్తుంది.

టాపిక్