తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : మిమ్మల్ని ఎక్కువ బాధపెట్టే విషయం అదే.. ఎందుకంటే..

Thursday Motivation : మిమ్మల్ని ఎక్కువ బాధపెట్టే విషయం అదే.. ఎందుకంటే..

08 September 2022, 7:27 IST

    • Thursday Motivation : ప్రపంచంలో మనల్ని ఎక్కువగా బాధపెట్టేది ఏంటో తెలుసా? మనం వాళ్ల వల్ల ఎప్పుడు బాధపడమూ అని మనం అనుకున్న వ్యక్తి వల్ల హర్ట్ అయినప్పుడు ఎక్కువ బాధపడతాము. ఎందుకంటే ఇతరుల వల్ల హర్ట్ అయ్యే అవకాశముందని తెలిసినా.. వీరి వల్ల హర్ట్ అవ్వము అనే నమ్మకం ఎక్కడో ఉండడం వల్ల ఎక్కువ బాధపడతాము.  
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Thursday Motivation : జీవితంలో ఎవరి నుంచి ఏమి ఆశించకూడదని ఎంత అనుకున్నా.. ఒక్క స్పెషల్ వ్యక్తిపై మాత్రం మనం ఎన్నో కొన్ని ఆశలు పెట్టుకుంటాము. ఎందుకంటే వారు మనతో అలాంటి బంధాన్ని ఏర్పరచుకుంటారు కాబట్టి. ఈ సమయంలో వారు మనల్ని ఎప్పటికీ బాధపెట్టరు. హ్యాపీగా చూసుకుంటారనే నమ్మకం ఆటోమేటిక్​గా కలిగిపోతుంది. అదే మన కొంప ముంచుతుంది.

ఒక వ్యక్తిని ఎక్కువ బాధపెట్టగల అత్యంత తీవ్రమైన విషయం ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఎందుకంటే ఓ వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు బాధపెట్టరు అనే నమ్మకమే మిమ్మల్ని ఎక్కువ బాధపడేలా చేస్తుంది. అదే మిమ్మల్ని నిరాశకు గురయ్యేలా చేస్తుంది. మనల్ని వేలు ఎత్తి చూపే వారు.. లేదా మనం ఏమి చేసినా తిట్టే వాళ్లు ఏదైనా అంటే మనం పెద్దగా పట్టించుకోము. లేదా అంతగా ఏమి బాధపడము. ఎందుకంటే వాళ్లు అలానే అంటారనే నమ్మకం మనలో ఉంటుంది కాబట్టి.

కానీ ఏ వ్యక్తి మనల్ని ఎప్పుడూ బాధపెట్టరు అనుకుంటామో.. మన గురించి అన్ని తెలుసుకదా.. మనల్ని అర్థం చేసుకుంటారనే భ్రమలో ఉంటామో.. ఆ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేస్తే.. కలిగే బాధ మాటల్లో వర్ణించలేనిది. ఎందుకంటే మీరు అందరికన్నా వారిపైనా ఎక్కువ నమ్మకం, ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వారి వల్ల హర్ట్ అయితే తీసుకోలేకపోతారు.

వారు అనేమాటాలు.. లేదా చేసే చేష్టలు అందరూ చేసేవే అయినా.. ఆ పర్సన్ పట్ల మీకున్న అభిమానమే మీరు మరింత బాధపడేలా చేస్తుంది. కాబట్టి ఎవరిపై అంచనాలు పెంచుకోకపోవడమే మంచిదని మీరు అర్థం చేసుకోవాలి. మీపైన, మీ కెరీర్​పైనా అంచనాలు సెట్ చేసుకోండి. వాటికోసం కష్టపడండి. అంతేకాని ప్రత్యేకమై వ్యక్తిని మీరు ఎన్నుకుంటే.. చివరకి వారు కూడా మిమ్మల్ని హర్ట్ చేస్తారు. మిమ్మల్ని మీకన్నా బాగా ఎవరూ అర్థం చేసుకోలేరనే విషయం గుర్తుంటే.. మీరు ఇంత బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇతరుల పట్ల మీ అంచనాలు ఎప్పుడూ తక్కువగానే ఉండేలా చూసుకోండి. లేదంటే మీ బాధ అంచనాలను మించి పోతుంది.