Summer Food : వేసవిలో మీ రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఇవే
15 March 2023, 12:29 IST
- Summer Food Tips : ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజురోజుకు వేడి ఎక్కువ అవుతుంది. అయితే ఎండాకాలంలో సరైన ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తి పెంచేవి ఫుడ్ తినాలి.
సమ్మర్ ఫుడ్
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అనేక శ్వాసకోశ వ్యాధులు కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున, రోగనిరోధక శక్తి(Immunity)ని ఎక్కువగా ఉంచడంలో సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవడం మంచిది.
అంటువ్యాధులతో పోరాడడంలో, దీర్ఘకాలిక వ్యాధులను దూరంగా ఉంచడంలో రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేసవి కాలం హీట్ స్ట్రోక్(heat stroke), డీహైడ్రేషన్(dehydration) నుండి డయేరియా వరకు అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఈ ఆరోగ్య సమస్యలను నివారించడానికి, వేసవి కాలంలో తగిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. తగినంత వాటర్(Water) కంటెంట్ ఉన్న తేలికపాటి, తక్కువ కేలరీల ఆహారాలు తినడం వల్ల అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు.
'రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి మనలను రక్షించగలదు. అనారోగ్యకరమైన వాటికి దూరంగా ఉంటే, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి సాయంగా ఉంటుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ.. వ్యాధికారకాలను శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.' అని డాక్టర్ సిద్ధాంత్ భార్గవ, ఫిట్‌నెస్ మరియు న్యూట్రిషనల్ సైంటిస్ట్ తెలిపారు.
మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ఆరోగ్యంగా ఉండటానికి మీరు మీ వేసవి(Summer)లో తినాల్సిన ఆహారాల గురించి ఇక్కడ ఉంది. వాటిని తిని ఆరోగ్యంగా ఉండండి.
వేసవిలో మీ డైట్‌లో చాక్లెట్, మాంసం(Meat), బచ్చలికూర, గుమ్మడి గింజలు వంటి జింక్-రిచ్ ఫుడ్‌లను చేర్చడానికి ప్రయత్నించండి. ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం కంటే సహజ పద్ధతులను ఉపయోగించడం ప్రాధాన్యతనివ్వాలి. వేసవి అనేది సంవత్సరంలో అత్యంత కీలకమైన వాతావరణం(Weather), అదనపు జాగ్రత్త అవసరం. బోన్ సూప్ తాగండి. శక్తివంతమైన యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న వెల్లుల్లి, పసుపు, దాల్చినచెక్క, తాజా అల్లం చిటికెడు అన్నింటినీ ఇందులో వేసి మరిగించొచ్చు.
కివీస్, నారింజ, బొప్పాయి, నిమ్మకాయలు(Lemon) వంటి విటమిన్ సి(Vitamin C) అధికంగా ఉండే ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చండి. విటమిన్ సి మంచి స్థాయిని కలిగి ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర విటమిన్లు, ఖనిజాలతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి. ఎందుకంటే విటమిన్ సి రోగనిరోధక శక్తికి పునాదిగా ఉంటుంది.
ఐరన్(Iron) తక్కువగా ఉన్న ఆహారం వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడవచ్చు. ఇది రక్తహీనత వంటి పరిస్థితులకు కూడా దారితీయవచ్చు. మీ రోగనిరోధక వ్యవస్థకు ఈ ఖనిజాన్ని పుష్కలంగా అందించడం చాలా ముఖ్యం. పౌల్ట్రీ, మాంసం, విత్తనాలు, గింజలు, క్రూసిఫెరస్ కూరగాయలు, ఎండిన పండ్లు(Dry Fruits) తీసుకోండి. ఇవి ఇనుము యొక్క కొన్ని అద్భుతమైన మూలాలు. జీర్ణ ప్రక్రియకు, పేగు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడే ఆహారాలను తీసుకోండి. ఆరోగ్యంగా ఉండటానికి రోగనిరోధక శక్తి ప్రధాన పునాది.