తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Quote : ప్రేమించే వాళ్ల దగ్గర అహం ఎందుకబ్బా.. సారీ చెప్తే సరి..

Sunday Quote : ప్రేమించే వాళ్ల దగ్గర అహం ఎందుకబ్బా.. సారీ చెప్తే సరి..

10 July 2022, 6:30 IST

    • అహం అనేది ఎలాంటి సంబంధాన్ని అయినా నాశనం చేయగలదు. మానవ విలువలు అనేవి అన్నింటికన్నా ఎక్కువ విలువైనవి. అలాంటింది మీ అహానికి పోయి.. బంధాలను దూరం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్. ప్రేమించిన వారి దగ్గర అహం పక్కన పెట్టి.. సరెండర్ అయిపోతే లైఫ్ జిల్ జిల్ జిగా అంటుంది. 
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి..
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి..

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలియాలి..

Sunday Motivational : ప్రతి ఒక్కరికి అహం ఉంటుంది. ఉండాలి కూడా. కానీ ఓ మనిషిని.. వారితో సంబంధాన్ని దూరం చేసుకునేంత మాత్రం ఉండకూడదు. కొన్నిసార్లు మనం మనవైపు తప్పున్నా.. ఎదుటివారికి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని సారీ చెప్పము. ఒక్కోసారి వారిని వదులుకునేందుకు అయినా సిద్ధపడతాము కానీ.. సారీ చెప్పము. ఎందుకంటే మనకు అహం అడ్డు వస్తుంది కాబట్టి. కానీ అహం మిమ్మల్ని డామినేట్ చేయకూడదు. మీరే అహాన్ని కంట్రోల్ చేయాలి. ప్రేమించే వారి దగ్గర కూడా అహాన్ని ప్రదర్శించాలి అనుకుంటే.. మీరు వారికి దూరం అయిపోయినట్లే.

ట్రెండింగ్ వార్తలు

River Rafting: మీకు రివర్ రాఫ్టింగ్ చేయడం ఇష్టమా? అయితే మన దేశంలో ఈ నదీ ప్రాంతాలకు వెళ్ళండి

New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

Husband Test: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘హస్బెండ్ టెస్ట్’ ,ఈ పరీక్షను మీరూ ఒకసారి చేసేయండి

Spicy Chutney: వేడివేడి అన్నంలోకి ఇలా స్పైసీగా పుదీనా టమోటో చట్నీ చేసుకోండి, ఎంత అన్నమైనా తినేస్తారు

మనం సంతోషంగా ఉన్నప్పుడు నవ్వాలి. బాధగా ఉన్నప్పుడు ఏడ్వాలి. ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి. దీనివల్ల మనం చుట్టూ ఉన్న ఆనందం, శ్రేయస్సును పూర్తి స్థాయిలో పొందగలుగుతాము. అంతేకాకుండా మన భావోద్వేగాలను, కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇలా నియంత్రించుకోవడం ద్వారా మనం ఏ సంబంధాన్ని దూరం చేసుకోము. పరిస్థితులు కూడా అదుపులో ఉంటాయి. మన తప్పులకు క్షమాపణ కోరడం అసలు తప్పే కాదు. మీ వాళ్ల దగ్గర మీరు క్షమాపణ చెప్పడానికి నామోషీ ఏంటి చెప్పండి? మీ వాళ్లకన్నా మీ అహమే గొప్పదంటారా?

అస్సలు అహం గొప్పదే కాదు. మన అనుకునే వారి ముందు మన తప్పులను అంగీకరించడం మీ బలహీనత అవ్వదు. మిమ్మల్ని వారి దృష్టిలో ఇంకా గొప్పవారిని చేస్తుంది. పైగా మీరు చేసిన ఈ పనికి వారు చాలా సంతోషిస్తారు. మిమ్మల్ని క్షమిస్తారు. మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

టాపిక్