తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : ఆనందాన్ని అందరూ.. అన్ని వేళలా కోరుకోవాలి..

Sunday Motivation : ఆనందాన్ని అందరూ.. అన్ని వేళలా కోరుకోవాలి..

19 June 2022, 8:20 IST

    • నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి అన్నాడు ఓ కవి. అలాగే సరదగా కుర్చొని నవ్వుకోవడమనేది మనకే కాదు మన పక్కన ఉన్నవారికి కూడా మంచి హాయినిస్తుంది. అలాంటి నవ్వును, ఆనందాన్ని వదులుకుని.. ఏదో బాధలు వెంటాడుతున్నాయని ముడుచుకుని కుర్చోంటే ఎలా?
సండే కోట్
సండే కోట్

సండే కోట్

Sunday Quote: జీవితంలో ప్రతిదీ మనం కోరుకున్న విధంగా జరగదు. మీకు నచ్చని విషయాలు చాలా జరుగుతాయి. ఇతరులు మీకు చాలా తెలివితక్కువవారుగా కనిపిస్తారు. ఒక్కోసారి వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారని మీకు అనిపించవచ్చు. ఇలాంటి కారణాలన్నీ మిమ్మల్ని చాలా అసహనానికి గురిచేస్తాయి. కానీ నిజమైన వ్యక్తి ఏ పరిస్థితులైనా తన మీద ఇంపాక్ట్ చూపించకుండా జాగ్రత్త పడతాడు. తన దృష్టిని మరల్చనివ్వడు. ఆ పరిస్థితులలో మంచి, చెడు మధ్య తేడాను గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరిస్తాడు. మనకి కూడా ఒక్కోసారి ఇష్టపడని విషయాలు జరుగుతాయి. అలాంటి సమయంలో ఆ విషయాలు మీ జీవితంపై ప్రభావం చూపలేవని మిమ్మల్ని మీరు నిర్ధారించుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Coconut Chutney: మూడు పప్పులు కలిపి ఇలా కొబ్బరి పచ్చడి చేస్తే అన్నంలో అదిరిపోతుంది

Banana Milk Shake: బనానా మిల్క్ షేక్ ఇలా తాగితే వేసవి తాపం నుంచి బయటపడవచ్చు

Coconut water: కొబ్బరి బోండా నుండి నేరుగా కొబ్బరినీళ్లు తాగకూడదట, ఎందుకో తెలుసుకోండి

Sweating Benefits: చెమట పట్టడం లేదని ఆనందపడకండి, చెమట పడితేనే కిడ్నీలు రాళ్లు చేరవు

"Don't let stupid things break your happiness"

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. కానీ జ్ఞాని అయిన వ్యక్తి తనకు హాని కలిగించే విషయాలను ఎప్పటికీ అనుమతించడు. కొన్నిసార్లు మనం పరిస్థితులను చాలా భావోద్వేగంగా తీసుకుంటాము. అవి జరగకపోతే కుమిలిపోతాము. అలాంటి సమయంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నా.. అది మీ మీద, మీ పనుల మీద ప్రభావం చూపించదు అని మీరు దృఢంగా నమ్మాలి. మనం జీవితంలో ఆనందం అనేది మీరు కోరుకుంటేనే వస్తుంది. అంతే కానీ మీ ఆనందాన్ని ఎవరో, ఏవైనా పరిస్థితులో డిసైడ్ చేయవు. మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలో నిర్ణయించేది మీరు తప్ప మరెవరో కాదు. మీ చర్యలు ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తాయని మీరు నమ్మాలి. ఈ విషయంలో కూడా మీరు ఆనందంగా ఉంటారు.

మీ దుఃఖానికి గల కారణాలు ఎల్లప్పుడూ వ్యక్తిగతంగా ఉండాలి. వాటి గురించి బాధపడాలా వద్దా అని నిర్ణయించేది మనం తప్ప మరెవరో కాదు. అందువల్ల మీ ముఖంలోని అందమైన చిరునవ్వును నాశనం చేయడానికి మీరు తెలివితక్కువ విషయాలు వేటిని అనుమతించకండి. మీరు సంతోషంగా ఉండటానికి చాలా కారణాలు అవసరం కావచ్చు. వాటిని వెతుక్కోండి. అంతే కానీ చిన్న చిన్న కారణాల వల్ల మీ ఆనందాన్ని దూరం చేసుకోకండి. ఈ పాజిటివ్ దృక్పథంతో మనం ఉంటే ఏదొక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాం.

టాపిక్