తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : మనుషులు శాశ్వతం కాదు.. వారు మిగిల్చిన జ్ఞాపకాలే శాశ్వతం

Sunday Motivation : మనుషులు శాశ్వతం కాదు.. వారు మిగిల్చిన జ్ఞాపకాలే శాశ్వతం

12 June 2022, 5:49 IST

    • ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదొక రిలేషన్ షిప్ ఉంటుంది. కొన్ని బంధాలు మనకి ప్రేమని పంచుతాయి. మరికొన్ని బంధాలు మనకి బాధను మిగులుస్తాయి. ఏ బంధానికి అయినా ముగింపు ఉంటుంది. దానిని మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రతి బంధం మనకి కొన్ని జ్ఞాపకాలను అందిస్తుంది. వాటితో జీవితాన్ని లీడ్ చేయాలి కానీ.. జీవితానికి ముగింపు పలుకకూడదు.
ప్రేమించిన వాళ్లు దూరం అయితే మనం జీవితాన్ని ఆపేసుకోనవసరం లేదు..
ప్రేమించిన వాళ్లు దూరం అయితే మనం జీవితాన్ని ఆపేసుకోనవసరం లేదు..

ప్రేమించిన వాళ్లు దూరం అయితే మనం జీవితాన్ని ఆపేసుకోనవసరం లేదు..

Sunday Motivation : మీరు మీ భాగస్వామి (భర్త/భార్య) లేదా తల్లి/తండ్రి, కూతురు, కొడుకు లేదా స్నేహితులతో.. ఇలా చాలా మందితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు. వారితో మీకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఎన్నో అద్భుతమైన రోజులు మీరు వారితో గడిపి ఉండొచ్చు. కానీ ఏదో రోజు ఆ బంధం ముగియక తప్పదు. మీ ఇద్దరి మధ్యలో వచ్చే మూడో వ్యక్తి వల్ల కావొచ్చు.. కాలంతో మారే మనసుల వల్ల కావొచ్చు.. ఏదైనా పరిస్థితుల వల్ల కావొచ్చు.. ఆఖరికి చావు వల్ల కూడా కొవొచ్చు.. ఇలా ఏదొక కారణంతో మనం బంధాలకు దూరం అవుతాం.

ట్రెండింగ్ వార్తలు

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

ఏదొక రోజు ఆ బంధాలు మీకు విసుగు కలిగించవచ్చు. మీరు ఒకసారి పంచుకున్న గొప్ప బంధం బలహీనపడటానికి... విశ్వాసం లేకపోవడం, నమ్మకద్రోహం, అపార్థం వంటి అనేక ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఈ విషయాలను ఎంత చర్చించినా.. జవాబు దొరకదు అనుకున్న సమయంలోనే మనం బంధాలకు దూరం అవుతాం. కొన్ని సందర్భాల్లో మనమే దూరం అవుతాం. మరికొన్ని సందర్భాల్లో అవతలి వ్యక్తులే మనల్ని విడిచిపోతారు. ఈ విషయంపై క్లారిటీ ఉంటే మీరు జీవితాన్ని అర్థాంతరంగా ముగించాల్సిన అవసరం ఉండదు.

ఎలాంటి బంధమైనా.. ఆఖరికి రక్తసంబంధమైనా ఏదొక కారణంతో ఆగిపోతుంది. ఈ విషయాన్ని గ్రహించిన వారు జీవితంలో హ్యాపీగా ముందుకు సాగుతారు. అలా సాగాలి కూడా. మీ మధ్య జరిగే సంభాషణలకు, మీరే ఉత్తమ న్యాయమూర్తి. కాబట్టి ఆ సంబంధంలో కొనసాగాలో.. లేక వాటిని పరిష్కరించడంలో అనేది మీ పైనే ఆధారపడి ఉంటుంది. కానీ ముగిసిన బంధాల గురించి ఆలోచించి.. జీవితాన్ని ఆపేయకండి.

టాపిక్