Friday Quote : రేపు సక్సెస్ అవ్వాలంటే.. ప్రిపరేషన్ ఈరోజే ప్రారంభించాలి..
10 June 2022, 9:23 IST
- జీవితం అనూహ్యమైనప్పటికీ.. భవిష్యత్తు కోసం మనం సిద్ధంగా ఉండడం.. దానికి తగినట్లు కృషి చేయడం చాలా ముఖ్యం. మీరు రేపు ఏ పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నారో.. ఈ రోజే దానికి తగిన ప్రణాళికలు చేసుకోవడం మంచిది.
సక్సెస్ కావాలంటే.. నేడే ప్రారంభించండి
Friday Motivational Quote | మనందరికీ జీవితంలో ఏదో సాధించాలనే కోరికలు, లక్ష్యాలు ఉంటాయి. ఈ కలలు నెరవేరాలంటే.. మనం దాని కోసం ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి ప్రత్యేక సమయం లేదా స్థలం ఉండదు. దానికోసం మనమే వాటిని క్రియేట్ చేసుకోవాలి. రేపు చేద్దాంలే అని ఆలస్యం చేశామా? మీ లక్ష్యం మీ చేజారిపోయినట్లే. కృషి, వివేకం మాత్రమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళతాయని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు కోరుకున్నది సాధించడానికి, జీవితంలో సంతృప్తి చెందడానికి మీ ప్రణాళికలను ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.
మీరు మీ ప్రయాణాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నారో అలానే వెళ్తుంది. మీరు దానికి ప్రిపేర్గా లేకపోతే.. అడ్డంకులు, ఆపదలు, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా మీరు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సవాళ్లు మిమ్మల్ని సమీపిస్తున్నప్పుడు మీరు దానిని ఎదుర్కోవాలి. అలాంటి పరిస్థితుల్లో సంయమనం పాటించడం చాలా ముఖ్యం. దానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనాలి. తద్వారా మీరు మార్పును ఎదుర్కోవలసి ఉంటుంది. దాన్ని అధిగమిస్తే భవిష్యత్తులో మీరు కోరుకున్నది సాధించవచ్చు.
మీరు మీ కోసం ఇంతకుముందు ప్లాన్ చేసుకున్నది ఇప్పుడు మీకు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. కాబట్టి దానికి మెరుగులు దిద్దవచ్చు. మీరు కొనసాగించాలనుకుంటున్న కొత్త అభిరుచిని మీరు కొనసాగించవచ్చు. దానికి అనుగుణంగా మీరు తదుపరి ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి పని చేస్తూనే ఉండండి. మీరు సంతృప్తి చెందారని భావించే వరకు.. మీ బెస్ట్ ఇవ్వండి. మనకి కావలసినవన్నీ అంత సులభంగా రావు. వచ్చినా ఆ తృప్తి ఎక్కువగా ఉండదు. కాబట్టి మీరు మీకు కావాల్సినదానికోసం కాస్త ఎక్కువ కష్టపడాలి. మీకు మద్దతు అవసరం. కానీ మీకు ఉన్న బలమైన మద్దతుదారు మీరేనని గుర్తుంచుకోండి.
మీరు కోరుకున్న విధంగా ఎవరూ మీకు అండగా నిలబడరు. ఏదొక సమయంలో వదిలి వెళ్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ మీపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగండి. మీకు ఏమి కావాలి అనే దానిపై క్లారిటీతో ఉండండి. దాని కోసం కృషి చేయండి. మీరు సమాజంలో ఏదైనా మార్పు చూడాలనుకుంటే మీ నుంచే దాన్ని ప్రారంభించండి. మీ ఆలోచన ఫలవంతం అని మీరు అనుకుంటే.. ఎవరైనా ధృవీకరించే వరకు వేచి ఉండకండి. మీరు ఏదైనా మంచి చేస్తే.. దాని ప్రభావం త్వరగా లేదా తరువాత అయినా మీరు చూస్తారు.
టాపిక్