తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sunday Motivation On Life Without Love Is Like A Tree Without Blossoms Or Fruit.

Sunday Motivation : చెట్టుకి నీరు పోస్తే పువ్వొస్తాది.. ప్రేమలో అతిలేనప్పుడే సక్సస్ అవుతాది

18 September 2022, 6:00 IST

    • ప్రేమలేనిదే జీవితం లేదు. ప్రేమే మనకు అన్ని.. ప్రేమించకపోతే ఏదో అయిపోతాది అని చెప్పడం ఉద్దేశం కాదు. కానీ.. జీవితంలో ప్రేమ అనేది ఉండాలి. ఎందుకంటే చెట్టుకి నీరు పోస్తేనే పువ్వుస్తాది. అలాగే జీవితంలో ప్రేమ అనేది నీరు లాంటింది. అది ఉన్నప్పుడు మన జీవితం కూడా పువ్వులా విరబూస్తుంది. పువ్వు రాలిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ చెట్టు బతుకుంది. మరెన్నో పువ్వులను, కాయలను మనకి అందిస్తుంది.
కోట్ ఆఫ్ ద డే
కోట్ ఆఫ్ ద డే

కోట్ ఆఫ్ ద డే

Sunday Motivation : ప్రేమ అనేది నీరు లాంటిదని చెప్పవచ్చు. అలాగే ఆక్సిజన్ అని కూడా చెప్పవచ్చు. ప్రేమ అనేది ఓ బూస్టర్ డోస్​ అని కూడా చెప్పవచ్చు. ప్రేమ లేకుంటే జీవితం లేదు అని అనుకోవడం కాదు కానీ.. మన లైఫ్​లో ప్రేమ ఉంటే.. ప్రేమించిన వ్యక్తి ఉంటే లైఫ్ బాగుంటాది అనేది వాస్తవం. ప్రతి ఒక్కరు దాని రుచిని అనుభవించి తీరాలి. ప్రేమ ఇచ్చే ధైర్యం.. అది ప్రేమ ఇచ్చే కేరింగ్.. ప్రేమ ఇచ్చే జ్ఞాపకాలు ఎప్పటికీ మరచిపోలేనివి. అందుకే మనల్ని ఎవరైనా ప్రేమిస్తే.. లేదా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని మరచిపోలేము.

ఈ ప్రేమ మన లైఫ్​లో కీ రోల్​ ప్లే చేస్తుంది. అది మిమ్మల్ని ఎంత దూరమైన తీసుకెళ్తుంది. కానీ ఏదైనా అతిగా తీసుకుంటే అది అనర్థమే చేస్తుంది. కాబట్టి ప్రేమలో ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి. ఎలా వెళ్తుందో దానిని అలాగే వెళ్లనిస్తే మంచిది. దానిని ఏమాత్రం ఎక్కువ తీసుకున్నా అది పాయిజిన్ అయిపోతుందని గుర్తుపెట్టుకోండి. అందుకే చాలా మంది ఎక్కువ ప్రేమిస్తారు. ఎక్కువ సఫర్ అవుతారు. ఒక్కోసారి తమ జీవితాన్నే నాశనం చేసేసుకుంటారు. తెలియకుండానే ఇవి జరిగిపోతుంటాయి.

కాబట్టి ప్రేమలో ఉన్నప్పుడు చాలా అలెర్ట్​గా ఉండాలి. ఎందుకుంటే నీరు ఎక్కువైతే మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. దానికి ఎంత కావాలో అంత నీరే మనం ఇవ్వాలి. అలాగే ప్రేమలో కూడా లిమిట్ ఉండాలి. అన్ కండీషనల్​ లవ్​ ఎప్పుడూ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రేమను ప్రేమగా ప్రేమించండి. అంతేకానీ ప్రేమను అతి ప్రేమతో తీసుకెళ్తే మాత్రం.. అది మీకు దూరమవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఓవర్ డోస్ మీ హెల్త్​కి అంత మంచిది కాదు. అతి ప్రేమ మీ ప్రేమ జీవితానికి అస్సలు మంచిది కాదు.

చాలామంది అనుకుంటారు ప్రేమిస్తే జీవితం నాశనం అయిపోతుందని.. లేదా సంతోషంగా ఉండరని. కానీ అది నిజం కాదు. ప్రేమలో హోప్స్ ఎక్కువైనప్పుడు.. ప్రేమ ఎక్కువైనప్పుడు.. అతి జాగ్రత్త ఎక్కువైనప్పుడు.. ఇలా ఈ అతిలన్నీ.. అత్యంతగా మారినప్పుడు ప్రేమను కోల్పోవాల్సి వస్తుంది. నేను ఇస్తుంది ప్రేమనే కదా.. ఇవి అతి ఎలా అవుతాయి అనుకోవచ్చు. కానీ.. మీ ప్రేమను తీసుకోగలిగే శక్తి అవతలి వాళ్లకి కూడా ఉండాలి కదా. ఏమో మీ ప్రేమ తెలియకుండానే వారిని ఇబ్బంది పెడుతుందేమో. మీ ప్రేమ తెలియకుండానే జాగ్రత్తలనే పేరుతో బౌండరీలు గీస్తుందేమో. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ చిట్టా ఆగదు. కాబట్టి ప్రేమించండి. ఈ అతిని తీసి ప్రేమిస్తే.. మీరు కూడా ప్రేమలో మునిగి తేలవచ్చు.