తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sperm Count There Are Reasons Why Sperm Count In Men Decreases

Low Sperm Count: పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాలు ఇవే!

28 February 2022, 18:06 IST

    • ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులను వేధిస్తున్న ఒక సమస్య సంతానలేమి. పిల్లలు కలగక పోవడానికి లేదా ఆలస్యం అవడానికి కారణాలు అనేకం. పురుషుల విషయానికి వస్తే.. ముఖ్యంగా వారి శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం లేదా వీర్యంలో నాణ్యతలేమి మొదలైనవి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి.
sperm cells
sperm cells

sperm cells

ఈ మధ్యకాలంలో చాలా మంది దంపతులను వేధిస్తున్న ఒక సమస్య సంతానలేమి. పిల్లలు కలగక పోవడానికి లేదా ఆలస్యం అవడానికి కారణాలు అనేకం. పురుషుల విషయానికి వస్తే.. ముఖ్యంగా వారి శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవడం లేదా వీర్యంలో నాణ్యతలేమి మొదలైనవి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. సంతానోత్పత్తికి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది అత్యంత కీలకం. స్పెర్మ్ కౌంట్ మెరుగ్గా లేకపోతే స్త్రీలు గర్భం ధరించే అవకాశంపై అది తీవ్రంగా ప్రభావితం చూపుతుంది. ఈ స్పెర్మ్ కౌంట్‌ తగ్గటానికి చాలా రకాల అంశాలు కారణమవుతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, చెడు అలవాట్లు, అనుసరించే జీవనశైలి పురుషుల్లో శుక్రకణాల సంఖ్యపై ప్రభావం చూపుతాయి.

పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించే కారకాలు:

 

ఊబకాయం: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం, అధిక BMI (Body Mass Index) కారణంగా వీర్యకణాల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి. ఊబకాయం టెస్టోస్టెరాన్‌పై ప్రభావం చూపి శుక్రకణాల ఉత్పత్తి స్థాయిని తగ్గిస్తుంది. అందువల్ల, అధిక బరువు ఉన్నవారు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎత్తుకు తగ్గట్టుగా బరువు ఉండడం వల్ల స్పెర్మ్ కౌంట్ సాధారణ స్థాయిలో ఉండి సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది.

ధూమపానం: ధూమపానం స్పెర్మ్ కౌంట్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.  సిగరెట్ తాగే పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ధూమపానం వీర్యం నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది, ఇది స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తుంది. అందుకే ధూమపానానికి దూరంగా ఉండాలి.

మధుమేహం: టైప్ 2 మధుమేహం టెస్టోస్టెరాన్‌పై ప్రభావం చూపి వంధ్యత్వానికి కారణమవుతుంది. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గుంచుకుంటూ బరువు పెరగడాన్ని నియంత్రించాలి.  ఇలా చేయడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్‌పై ఎలాంటి ప్రభావం పడదు, స్పెర్మ్ కౌంట్ కూడా సాధారణ స్థాయిలో ఉంటుంది.

ఆల్కహాల్ వినియోగం: పురుషుల్లో సంతానోత్పత్తికి టెస్టోస్టెరాన్ హార్మోన్‌ చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ హార్మోన్ పురుషుల్లో వీర్యం ఉత్పత్తికి, శరీరం ఎదుగుదలకు సహాయం పడుతుంది. అధిక ఆల్కహాల్ వినియోగం కాలేయంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది, అపుడు కాలేయం టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను విడుదల చేయదు. దీంతో అది సంతానలేమి సమస్యకు కారణమవుతుంది.

కాలుష్యం: ప్రస్తుత నాగరిక జీవితంలో కాలుష్యం కూడా మానవ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. నాణ్యత లేని గాలిని పీల్చడం కారణంగా పాలీసైక్లిక్ హైడ్రోకార్బన్‌లు శరీరంలోకి ప్రవేశించి అవి శుక్రకణాలపై ప్రభావం చూపుతున్నాయి. కాలుష్యం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గడమే కాకుండా ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. అందుకే ఎలాంటి కాలుష్యాలు లేని స్వచ్ఛమైన వాతావరణం ఉండే చోట నివసించడం చాలా విధాల మేలు.