తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sleeping On Your Left Side Here Are Some Amazing Benefits Details Inside

Left Side Sleeping : మీరు ఎడమ వైపు నిద్రపోతారా? లేదా కుడివైపునా? ఏది మంచిది

HT Telugu Desk HT Telugu

26 March 2023, 20:00 IST

  • Left Side Sleep Benefits : మన ఆరోగ్యం, శ్రేయస్సు అనేది తగినంత నిద్ర పొందడంపై ఆధారపడి ఉంటుంది. మన శరీరం విశ్రాంతి తీసుకుని రీఛార్జ్ అయ్యేందుకు నిద్ర ముఖ్యం. అయితే కొంతమంది వివిధ రకాలుగా పడుకుంటారు. పడుకునే విధానం ఆధారంగా కూడా.. మన ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది.

ఎడమ వైపు నిద్ర
ఎడమ వైపు నిద్ర

ఎడమ వైపు నిద్ర

నిద్రించే భంగిమ కూడా మీ ఆరోగ్యంపై(Health) ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? ముఖ్యంగా ఎడమ వైపున పడుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎడమ వైపున పడుకోవడం ఎందుకు ముఖ్యమో ఇక్కడ కారణాలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Poppy Seeds Benefits : గసగసాలతో అనేక ప్రయోజనాలు.. కంప్లీట్ సమాచారం మీ కోసం

Wedding Dress : పెళ్లి బట్టలు చాలా సంవత్సరాలు భద్రపరిచేందుకు కొన్ని సింపుల్ టిప్స్

Cool Places in AP: వేసవిలో విశాఖపట్నానికి వెళితే కచ్చితంగా చూడాల్సిన చల్లటి ప్రదేశాలు ఇవే

Washing Fruits: పండ్లపై ఉన్న కనిపించని పురుగుమందులను ఇలా సులువుగా తొలగించండి, వాటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదం

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఎడమ వైపున పడుకోవడం వల్ల మీ పేగుల నుంచి వ్యర్థాల సహజ ప్రవాహాన్ని ప్రోత్సహించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ ఎడమ వైపు(Left Side Sleeping) నిద్రిస్తున్నప్పుడు మీ కడుపు, ప్యాంక్రియాస్ స్థానం మీద ప్రభావం ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

గురకను తగ్గిస్తుంది

మీ ఇంట్లో ఎవరైన గురక(Snoring) పెట్టినట్లయితే ఎడమ వైపున నిద్రించమని చెప్పండి. ఇలా పడుకుంటే.. శ్వాసనాళాలను తెరిచి ఉంచడం ద్వారా గురకను తగ్గించడంలో సహాయపడుతుంది. గర్బిణులు ఎడమవైపుకు తిరిగి పడుకుంటే మంచి రక్త ప్రసరణ ఉంటుంది. గర్బాశయానికి ఉపయోగకరం. కడుపులోని పిండానికి, మూత్ర పిండాలకు రక్త ప్రసరణ జరగుతుంది.

గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది

ఎడమ వైపున పడుకోవడం వల్ల మీ గుండెపై ఒత్తిడి(Stress On Heart) తగ్గుతుంది. రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఎడమవైపు నిద్ర గుండె ఆరోగ్యాన్ని(Heart Health) మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే గుండె మీ శరీరానికి ఎడమ వైపున ఉంటుంది, కాబట్టి మీ ఎడమ వైపున నిద్రించడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందుతుంది

మీరు వెన్నునొప్పితో(Back Pain) బాధపడుతుంటే, ఎడమ వైపున పడుకోవడం నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఈ రకం నిద్ర మీ వెన్నెముక సహజ వక్రతను అనుమతిస్తుంది, ఇది మీ వెనుక ఒత్తిడిని తగ్గిస్తుంది.

శోషరస వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది

శరీరం నుండి వ్యర్థాలు, విషాన్ని తొలగించడం శోషరస వ్యవస్థ యొక్క విధి. ఎడమ వైపున నిద్రపోవడం అనేది.. మీ ఎడమ వైపున ఉన్న శోషరస కణుపులను మరింత సమర్థవంతంగా హరించడానికి అనుమతించడం ద్వారా మీ శోషరస వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీ ఆరోగ్యం(Health) మెరుగుపరచుకోవాలనుకుంటే, మీ ఎడమ వైపున నిద్రించడానికి ప్రయత్నించండి.