తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : అప్పుడప్పుడు సైలంట్​గా ఉండండి.. అందరికీ మంచిది..

Saturday Motivation : అప్పుడప్పుడు సైలంట్​గా ఉండండి.. అందరికీ మంచిది..

18 June 2022, 9:55 IST

    • కొన్నిసార్లు పట్టుకోవడం కన్నా వదిలేయడమే బెటర్.. గెలవడం కన్నా ఓడిపోవడమే బెటర్ అని ఓ సినిమాలో డైలాగ్ రాశారు త్రివిక్రమ్. అలాగే కొన్ని సందర్భాల్లో ప్రతి స్పందించడం కన్నా.. సైలంట్​గా ఉండటమే మంచిది.
మౌనంగా సమస్యను పరిష్కరించుకోండి..
మౌనంగా సమస్యను పరిష్కరించుకోండి..

మౌనంగా సమస్యను పరిష్కరించుకోండి..

Saturday Motivation : జీవితంలో ఒక్కో దశలో.. ఒక్కొక్కరికి విభిన్న అనుభవాలు కలుగుతాయి. అవి మనల్ని విభిన్నంగా ప్రేరేపిస్తాయి. కానీ వేర్వేరు పరిస్థితులకు తగిన విధంగా స్పందించడం అందరూ నేర్చుకోవాలి. తద్వారా మన ప్రతిచర్యలు అర్థవంతంగా ఉంటాయి. అంతేకాకుండా అవి ఎవరిపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపించవు. కొన్నిసార్లు.. కొన్ని విషయాల్లో మనం ప్రతిస్పందించడానికి బదులు మనం మూగబోతాము. కానీ కొన్ని సమయాల్లో.. మనకు బలమైన అభిప్రాయం ఉంటుంది. దానిని వ్యక్తపరచాలని కూడా చూస్తాము. కానీ అలా చేయడం వల్ల పరిణామాలు మారిపోయే అవకాశముంది. మన భావాలను వ్యక్తపరచే ముందు.. దాని తర్వాత జరిగే పర్యావసనాల గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ మాటలు మీకు ఇబ్బంది కలిగించకపోవచ్చు కానీ.. వేరొకరిపై ప్రతికూలప్రభావాన్ని చూపే అవకాశముంది.

ట్రెండింగ్ వార్తలు

Korrala Pongali: బ్రేక్ ఫాస్ట్‌లో కొర్రల పొంగలి వండుకోండి, డయాబెటిస్ ఉన్న వారికి ఇది బెస్ట్ అల్పాహారం

Saturday Motivation: ఏం జరిగినా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి, ఎప్పటికైనా మేలే జరుగుతుంది

Buttermilk : వేసవిలో మజ్జిగను ఇలా చేసి తాగితే చర్మం, జుట్టుకు చాలా మంచిది

Iskon khichdi Recipe : కొత్తగా ట్రై చేయండి.. ఇస్కాన్ కిచిడీ రెసిపీ.. చాలా టేస్టీ

మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పోలిస్తే.. ఆ తర్వాత జరిగే పరిణామాల ఫలితాన్ని అంచనా వేసి.. దానికి అనుగుణంగా సైలంట్​గా ఉండిపోవడమే మంచిది. అంటే ప్రతిసారి సైలంట్​గా ఉండమని అర్థం కాదు. తప్పు జరిగితే వ్యతిరేకంగా పోరాడాలి. అయితే ప్రతిస్పందించే ముందు పరిస్థితిని అంచనా వేయండం చాలా ముఖ్యం. మీ ప్రతిచర్య ఇతరులను ప్రతికూలంగా ప్రభావితం చేయకూడదు. మౌనంగా ఉండడం ద్వారా అనవసరమైన నాటకీయతను నివారించవచ్చు. ఇది ఎల్లప్పుడూ అందరికీ మంచిదని గుర్తుంచుకోవాలి. సమస్యను పరిష్కరించడానికి మరింత సరైన సమయాలు, సందర్భాలు కూడా రావొచ్చు.

కొన్నిసార్లు మౌనంగా ఉండకపోవడం వల్ల మీరు కోరుకోని పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి మౌనంగా ఉండండి. మౌనంగా ఉండడం అంటే మీరు చేయాల్సిన పనికి దూరంగా ఉన్నారని అర్థం కాదు. మాటలు కంటే చర్యలు బిగ్గరగా మాట్లాడతాయి. కాబట్టి సైలంట్​గా మీ పని మీరు చేసుకోండి. అది అర్థవంతంగా ఉంటుంది. సమస్యను పరిష్కరించడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

టాపిక్