తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saturday Motivation : వర్తమానంలో జీవించాలి.. భవిష్యత్తును మెరుగుపరచుకోవాలి

Saturday Motivation : వర్తమానంలో జీవించాలి.. భవిష్యత్తును మెరుగుపరచుకోవాలి

11 June 2022, 10:26 IST

    • తెలివైన వ్యక్తి సానుకూల విషయాలను గ్రహించడమే కాకుండా.. ప్రతికూలతల నుంచి ఉపయోగకరమైన విషయాలను కూడా నేర్చుకుంటాడు. అందుకే పాజిటివ్ వైబ్స్ కలిగి ఉండడం చాలా ముఖ్యం. అనవసరంగా టెన్షన్ పడిపోవడం కంటే.. పాజిటివ్ గా థింక్ చేస్తూ.. ప్రశాంతంగా ఉండడం మంచిది.
పాజిటివ్ వైబ్స్
పాజిటివ్ వైబ్స్

పాజిటివ్ వైబ్స్

Saturday Motivation Quote : సానుకూల శక్తి ఎల్లప్పుడూ మానవాళికి ఒక వరం. దేనినైనా పాజిటివ్ గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన చుట్టూ జరిగే పరిస్థుతులు మనకు సానుకూల ప్రభావాన్ని ఇస్తాయి. సానుకూల శక్తి ఉన్న వ్యక్తులను సమాజం ఉన్నతంగా పరిగణిస్తుంది. వారిని గౌరవిస్తుంది. ప్రజలు వారితో ఉండటానికి ఇష్టపడతారు. మరికొందరు వారిని ఆరాధిస్తూ.. వారిలాంటి దృక్పథం కలిగి ఉండాలని కోరుకుంటారు. పాజిటివ్ గా ఉండడం అనేది మనలోని శక్తిని ప్రసరింపజేయడం వంటిది. దీనికి పరిమితులు, పరిధిలు వంటివి ఏమి ఉండవు.

మన జీవితాలు సవాళ్లు, లెక్కించలేని అడ్డంకులతో చుట్టుముట్టి ఉన్నాయి. అందువల్ల మన పనిపై దృష్టి పెట్టడం, నమ్మకంగా, ప్రేరణతో ఉండటం చాలా ముఖ్యం. సానుకూల శక్తి ఎల్లప్పుడూ మంచి ఆలోచనను ఇస్తుంది. అంతేకాకుండా హేతుబద్ధమైన, వాస్తవిక ఆలోచనలను ప్రేరేపిస్తుంది. మన గతం నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది.

మనం మన జీవితాన్ని వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించాలి. మన భవిష్యత్తును మెరుగుపరచుకోవాలి. ఏదైనా కార్యాచరణ లేదా ఫలితానికి ఎల్లప్పుడూ రెండు మార్గాలు లేదా ముఖాలు ఉంటాయి. ఈ వాస్తవాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. మంచి విషయాలతో పాటు చెడు విషయాలు కూడా ప్రతి దానిలో, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. వారి తప్పులను మాత్రమే చూసి వేలు పెట్టి చూపించాల్సిన అవసరం మనకు లేదు. అలాంటి విషయానికొచ్చినప్పుడు మీలోని తప్పులను గుర్తించి వాటిని మార్చుకునేందుకు ప్రయత్నించండి. ప్రేరణ పొందిన మనస్సు సానుకూల అంశాలను మాత్రమే అంగీకరిస్తుంది. అది వారిలోని చెడును నిర్లక్ష్యం చేసేలా చేస్తుంది. ఇది మనం జీవితాన్ని ఎలా విలువైనదిగా పరిగణించాలో కూడా నేర్పుతుంది.

జీవితం ఎప్పుడూ శూన్యమైన కల కాదని గుర్తుంచుకోండి. దానిలో తప్పనిసరిగా ఏదొక ప్రయోజనం, అర్థం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా ఉండటం ఒక ఎంపిక కాదు అది జీవనశైలి అని గుర్తించాలి. సత్యం, సానుకూలత అనే స్తంభాలపై మన ఆదర్శ జీవనశైలిని నిలబడుతుంది. మనం ఎక్కడికి వెళ్లినా.. మన చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉండాలి. జీవితంలోని కష్టతరమైన, సవాలుతో కూడిన పరిస్థితులలో కూడా ప్రశాంతంగా, ఓపికగా ఉండడమే మన ఏకైక కర్తవ్యం. ఇది హేతుబద్ధంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. మన నిర్ణయాలను ఆత్మపరిశీలన చేసుకోవడానికి, నిశితంగా పరిశీలించడానికి అవసరమైన సమయాన్ని ఇస్తుంది. గతం గురించి తెలియకుండా వర్తమానం గురించి నిజమైన అవగాహన పొందలేము. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకుని.. మిగిలిన వాటి గురించి ఆలోచించాలి.

టాపిక్

తదుపరి వ్యాసం