తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Friday Motivation : ఆనందాన్ని పొందాలంటే.. వీలైనంత ఎక్కువ ప్రేమించండి..

Friday Motivation : ఆనందాన్ని పొందాలంటే.. వీలైనంత ఎక్కువ ప్రేమించండి..

17 June 2022, 10:52 IST

    • మన జీవితంలో ఆనందంతో పాటు.. ప్రేమ చాలా ముఖ్యమైనది. ఈ రెండు అంశాలు ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి. మీరు ఒకరిని ప్రేమించలేకపోతే, మీరు ఆనందాన్ని పొందలేరు. మీరు ఆనందాన్ని పొందాలంటే, వీలైనంత వరకు ప్రేమను పంచాలి.
లవ్
లవ్

లవ్

Friday Motivation : పరిస్థితుల కారణంగా మనం ఒకరిని ప్రేమించడం కొన్నిసార్లు చాలా కష్టమని అనిపిస్తుంది. అయితే మీరు ఎవరినైనా మనస్పూర్తిగా ప్రేమించగలిగితే.. మీ ఆనందాన్ని ఎవరూ ఆపలేరు. మనసుకు అయ్యే గాయాలకు ప్రేమే బెస్ట్ వైద్యం. మీరు ప్రేమను పొందాలంటే ముందు మీరు వారిని ప్రేమించాలి. అప్పుడే అది మీకు వారి నుంచి రిటర్న్​ అవుతుంది. ఒకరిని ప్రేమించకుండా.. ప్రేమను కావాలి, పొందాలి అనుకోవడం ముమ్మాటికి తప్పే.

ట్రెండింగ్ వార్తలు

International Tea Day : ఇంటర్నేషనల్ టీ డే.. టీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసుకోండి

Chewing Food : ఆయుర్వేదం ప్రకారం ఆహారాన్ని ఎన్నిసార్లు నమిలితే ఆరోగ్యానికి మంచిది

Almond Skin Care Tips : బాదం పప్పును ఇలా వాడితే మీ చర్మం మెరిసిపోతుంది.. ట్రై చేయండి

Chana Masala Recipe : శనగలతో ఇలా రెసిపీ చేస్తే.. చపాతీ, రైస్‌లోకి లాగించేయెుచ్చు

మన ప్రేమను ఇతరులను సంతోషపరచాలి. వారి మనసుకు అయ్యే గాయాలను మాన్పించగలగాలి. అంత ప్రేమను మీరు వారికి ఇచ్చినప్పుడు.. దానికి రెట్టింపు ప్రేమ మీకు దక్కుతుంది. అది మీకు మునుపెన్నడూ లేనంతా సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడూ పొందని అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రేమ మిమ్మల్ని సంతోషపెట్టడమే కాకుండా.. మీకు కావాల్సినంత సంతృప్తిని ఇస్తుంది. ప్రేమ లేకుండా మన జీవితంలో ఉనికే లేదు. కాబట్టి మీకు ఎవరినైనా ప్రేమించే అవకాశం వస్తే.. దానిని వదులుకోకండి. ఒకరినుంచి ప్రేమను పొందాలనుకుంటే.. మీరు కూడా వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రేమను ఇవ్వకుండా.. మీరు ఒకరి నుంచి ప్రేమను ఆశించలేరు. అది కరెక్ట్ కాదు.

ప్రేమ అనేది మనం పరస్పరం మార్పిడి చేసుకోవలసిన అంశం. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తే.. వారిని ఎప్పుడూ నియంత్రించకండి. అయితే మీరు ప్రేమ నుంచి ఏమి ఆశించకపోవడమే మంచిది. ఇదే ఉత్తమమైన ఎంపిక. ప్రేమనుంచి మీరు ఏదైనా ఆశిస్తే.. అప్పుడే అసలైన సమస్యలు మొదలవుతాయి. ఒకరిని ప్రేమించినా.. ఆ వ్యక్తి మీకు తిరిగి ప్రేమను అందించడంలో విఫలమైతే.. అది మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ప్రేమలో ఏది తిరిగి ఆశించకండి. కానీ మీరు ఎవరికైనా ప్రేమను ఇస్తే.. మీరు దానిని తిరిగి పొందుతారనేది జీవిత నియమం కాబట్టి.. మీరు దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రేమ మీకు సంపద లాంటిది. అది మీ జీవితాంతం మరిచిపోలేనన్ని జ్ఞాపకాలను మీకు ఇవ్వగలదు.

తదుపరి వ్యాసం