తెలుగు న్యూస్  /  Lifestyle  /  Keep Smiling And One Day Life Will Get Tired Of Upsetting You

Thursday Motivation : కష్టమొచ్చినా అధైర్యపడకండి.. సంతోషంగా ముందుకు సాగిపోండి..

16 June 2022, 10:06 IST

    • కష్టమనేది లేని రోజంటూ లేదు కదా.. కన్నీరు దాచుకుంటూ సాగకుంటే తప్పదుగా.. అని ఓ లిరిక్​ రైటర్​ చాలా గొప్పగా రాశాడు. అలాగే జీవితంలో ఏ కష్టమొచ్చినా.. అధైర్యపడకుండా.. ముందుకు నవ్వతూ సాగిపోవాలి.
మార్నింగ్ మోటివేషన్
మార్నింగ్ మోటివేషన్

మార్నింగ్ మోటివేషన్

Thursday Motivation : జీవితంలో మంచి, చెడు సమయాలను ఎదుర్కోవడం అనివార్యం. కానీ ఎలాంటి సందర్భాల్లో అయినా సానుకూల దృక్పథాన్ని కొనసాగించడమనేది చాలా ముఖ్యం. ఇది మీకు జీవితంలో ముందుకు వెళ్లేందుకు సహాయం చేస్తుంది. మీరు జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. దీనివల్ల మీరు నిస్సహాయంగా ఉన్నారని మీరు అనుకుంటే.. మీరు జీవితంలోని సానుకూల అంశాలపై దృష్టి పెట్టండి. అది మీకు చిరునవ్వు వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా మీరు సమస్యలతో పోరాడే శక్తి మీలో ఉందని గుర్తిస్తారు.

ప్రతి సమస్యను పాజిటివ్​గా తీసుకుని ముందుకు సాగుతున్నప్పుడు జీవితం కూడా మీకు కష్టాలు ఇవ్వడాన్ని తగ్గిస్తుంది. ఎందుకంటే మీరు మీ మార్గంలో వచ్చే ఏ సమస్యనైనా ఎదురించగలరు. ఆ నమ్మకం మీలో కూడా బలంగా ఉంటుంది కాబట్టి కష్టాలు మీ దగ్గరికి వచ్చినా.. అంతగా ఇబ్బంది అనిపించవు. అయితే ఈ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాదు. స్వీయ సందేహం, నిరాశలను అధిగమించి.. ఆ స్థాయికి చేరుకోవాలి. మీరు స్ట్రాంగ్​గా ఉంటే.. మీ సమస్యలతో పోరాడే శక్తిని మీరే కనుగొంటారు. మంచి, చెడు సమయాలు రెండూ దశలవారీగా వస్తాయని తెలుసుకోండి. మంచి సమయాల్లో కృతజ్ఞతతో ఉండండి.. ప్రతి క్షణాన్ని ఆరాధించండి. చెడు సమయాల్లో మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోండి. అవసరమైనప్పుడు సహాయం తీసుకోండి. అవి నేర్పించే పాఠాలు నేర్చుకోండి.

చెడు సమయాల్లో నేర్చుకున్న పాఠాల కారణంగా మీరు మరింత బలపడతారు. ఈ సమయమంతా సమస్యలను తట్టుకునే శక్తి మీలో ఉందని తెలుసుకోండి. ఈ దృక్పథం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మీ జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. అవసరమైనప్పుడు ఇతరులకు కూడా సహాయం చేయగలరు. ఎందుకంటే మీరు మీ అనుభవం నుంచి ఎంతో నేర్చుకుంటారు. ఈ విధంగా ఉంటే మన జీవితాన్ని మరింత ఫలవంతం చేసుకోవచ్చు.

టాపిక్