తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thursday Motivation : వాస్తవికానికి దగ్గరగా లేకపోతే.. మీ గోల్​ రీచ్​ కాలేరు..

Thursday Motivation : వాస్తవికానికి దగ్గరగా లేకపోతే.. మీ గోల్​ రీచ్​ కాలేరు..

09 June 2022, 7:35 IST

    • మనకు గెలవాలని ఎంత తాపత్రయం ఉన్నా.. మనల్ని మనం ఎంత మోటీవేట్​ చేసుకున్నా.. వాస్తవానికి దగ్గరగా లేకపోతే.. మన గోల్​ను రీచ్​ అవ్వలేము. ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే.. అంత త్వరగా సక్సెస్​ అవుతారు.
మోటివేషనల్ కోట్
మోటివేషనల్ కోట్

మోటివేషనల్ కోట్

Thursday Motivation : జీవితంలో ఓ స్థాయికి చేరుకోవాలని అందరికీ ఉంటుంది. దానికోసం ఎంతైనా కష్టపడతారు. కానీ ఒక్కోసారి మనల్ని మనం ఎంత ఎంక్రేజ్ చేసుకున్నా.. వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అనుకున్న వెంటనే అన్ని జరిగిపోవు. ఒక్కోదానికి ఒక్కో సమయం పడుతుంది. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి గోల్​ని రీచ్​ అవ్వడానికి సమయం పడుతుందని గుర్తించాలి.

ట్రెండింగ్ వార్తలు

Fatty liver in diabetics: ఫ్యాటీ లివర్.. డయాబెటిస్, ఊబకాయం ఉన్న వారిలో ఇది కామన్

Mutton Curry: పచ్చిమామిడి మటన్ కర్రీ స్పైసీగా వండుకుంటే అదిరిపోతుంది

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

Avoid Tea and Coffee: టీ కాఫీలు ఎప్పుడు తాగాలో, ఎంత తాగాలో చెబుతున్న ICMR వైద్యులు, వాటి వల్ల ప్రమాదాలు ఇవే

కొందరు ఎలా ఉంటారంటే.. వారికి జీవితంలో ఏదో సాధించాలనే ఆశ ఉంటుంది. దానికి తగ్గట్లు కృషి చేయాలనుకుంటారు. కానీ ఫలితాలు త్వరగా వచ్చేయాలని చూస్తారు. ఆశించిన ఫలితాలు రాకపోతే.. తీవ్ర మనోవేధనకు గురైపోతారు లేదా.. గోల్​ని వదిలేస్తారు. అలాకాకుండా.. మనం గోల్​ ఎంత మంచిదైనా సరే.. కాస్త ఓపికగా ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో దాని రీచ్​ అవ్వడానికి సమయం పడుతుందని గుర్తించాలి. దానికి అనుగుణంగా మన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మీరు ఈ వాస్తవాన్ని గ్రహించకపోతే.. మీ గోల్​ను ఎప్పటికీ రీచ్​ కాలేరు. అవాస్తవంగా ఉంటే.. మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. ఇది మన ఆదర్శాలను వాస్తవంగా మార్చడం మరింత కష్టతరం చేస్తుంది. ఆదర్శాలను కలిగి ఉండటం మంచిది. తప్పేమి కాదు. కానీ మీరు వాస్తవికంగా లేకుంటే.. మీరు ఏదైనా సాధించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా.. ఎలాంటి పురోగతి లేకుండా ఘోరంగా విఫలమవుతారు.

కొన్నిసార్లు గోల్​ రీచ్​ అవ్వడానికి మీరు పెద్ద ప్లాన్స్​ వేస్తారు. అన్ని సార్లు ఆ ప్రణాళికలు పనిచేయవు. కొన్నిసార్లు చిన్న నిర్ణయాలు తీసుకోవాలి. చిన్న చిన్న నిర్ణయాలే పెనుమార్పులు సృష్టిస్తాయని మరచిపోకూడదు. నా ఆదర్శాల కంటే రియాలిటీ చాలా మంచి గురువని నమ్మాలి. అప్పుడు వాస్తవికత నుంచి చాలా విషయాలు నేర్చుకోగలము. మీ ఆదర్శాలను విడిచిపెట్టకుండా.. వాస్తవికతను గుర్తించి ముందుకు సాగితే విజయం తప్పకుండా వరిస్తుంది.

టాపిక్

తదుపరి వ్యాసం