తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

Ayurvedam Tips: నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వును కలిపి తినమని చెబుతున్న ఆయుర్వేదం, అలా తింటే ఏం జరుగుతుందంటే

Haritha Chappa HT Telugu

15 May 2024, 10:33 IST

google News
    • Ayurvedam Tips: ఆయుర్వేదం ప్రాచీన కాలంగా మన ఆరోగ్యాన్ని కాపాడుతూ వస్తోంది. ఆయుర్వేదం చేసే సిఫారసులను పాటిస్తే అన్ని విధాలుగా శరీరానికి మంచే జరుగుతుంది.
ఆయుర్వేదం చిట్కాలు
ఆయుర్వేదం చిట్కాలు (Pexels)

ఆయుర్వేదం చిట్కాలు

Ayurvedam Tips: ఇంటి చిట్కాలతోనే ఆయుర్వేదంలో చికిత్సలు చేస్తూ ఉంటారు. సాధారణంగా మన వంట గదిలో దొరికే పదార్థాలని వ్యాధుల నివారణకు వినియోగిస్తారు. అల్లం టీతో జీర్ణ సమస్యలను తగ్గించుకోవడం, పుదీనా నూనెతో తలనొప్పిని తగ్గించుకోవడం వంటి చిట్కాలను ఆయుర్వేదం చెబుతుంది. సహజ పదార్థాలకే వైద్యశక్తిని ఉందని చెప్పడమే ఆయుర్వేదం ఉద్దేశం. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం ప్రతిరోజూ నానబెట్టిన కిస్మిస్లు, రెండు కుంకుమపువ్వు రేకులు కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ మన శరీరంలో ఎలాంటి మ్యాజిక్ ను చేస్తాయో వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

రాత్రి నానబెట్టిన తరువాత...

నల్ల ద్రాక్షలు లేదా పచ్చ ద్రాక్షలను ఎండబెట్టి... కిస్‌మిస్‌ల పేరుతో అమ్ముతూ ఉంటారు. వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వీటికి ప్రసిద్ధ స్థానం ఉంది. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం వాటిని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇలా నీటిలో నానబెట్టడం వల్ల అవి రసవంతంగా మారుతాయి. అలాగే కుంకుమ పువ్వులను నీటిలో నానబెట్టి ఉంచాలి. ఈ రెండూ పదార్థాలను కలిపి తింటూ ఉండాలి. కుంకుమ పువ్వులు అధిక ధరను కలిగి ఉంటాయి. కాబట్టి కేవలం రోజుకి రెండు రేకులు నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటి ధర అధికం కాబట్టే కుంకుమ పువ్వులను గోల్డ్ మసాలా అని పిలుస్తారు. వీటిలో క్రోసిన్, క్రోసేటిన్, సఫ్రానల్ బట్టి ఆరోగ్యాన్ని అందించే సమ్మేళనాలు ఉన్నాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా అధికం.

ఏంటి ఉపయోగాలు?

ఇలా నానబెట్టిన కిస్మిస్లు, కుంకుమ పువ్వు రేకులను కలిపితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కిస్మిస్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. శరీరంలో ఇనుము శోషణను కూడా మెరుగుపరుస్తుంది. దీని వల్ల రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది. రాత్రంతా కిస్మిస్లను నానబెడతారు. కాబట్టి ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే కుంకుమ పువ్వుతో కలిపి వీటిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రావు. పొట్టలో ఉన్న మంచి బాక్టీరియాను ఇది కాపాడుతుంది. మొత్తం జీర్ణ ఆరోగ్యానికి కుంకుమ పువ్వు కిస్మిస్లు కలిపి మేలు చేస్తాయి.

వాత దోషాన్ని తగ్గించడంలో ఈ కిస్మిస్‌లు, కుంకుమ పువ్వు కలిసి మ్యాజిక్ చేస్తాయి. నానబెట్టిన కుంకుమ పువ్వులో తేమగుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి. జ్ఞాపకశక్తిని అభిజ్ఞా పని తీరును మెరుగుపరుస్తాయి. మెదడుకు కావలసిన ఎన్నో పోషకాలను ఈ నానబెట్టిన కిస్మిస్లు, కుంకుమపువ్వు అందిస్తాయి. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆ మనిషి ఏదైనా సాధించగలడు. అలాగే పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి ఈ రెండింటి కాంబినేషన్ పనిచేస్తుంది. విద్యార్థులకు ఈ రెండింటినీ కలిపి తినిపిస్తే వారు చదివింది. ఎక్కువ కాలం పాటు గుర్తుపెట్టుకుంటారు.

మహిళల కోసం...

మహిళలు కూడా ప్రతిరోజూ నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమ పువ్వులను కలిపి తినడం చాలా అవసరం. ఇది నెలసరి సమయంలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి. నెలసరి సమయంలో కొంతమందికి విపరీతమైన పొట్ట నొప్పి వస్తుంది. తిమ్మిరిగా అనిపిస్తుంది. అసౌకర్యంగా ఉంటుంది. వీటన్నింటినీ తగ్గించే శక్తి ఈ రెండింటికీ ఉంది. అలాగే గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పునరుత్పత్తి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఈ రెండింటికి అయ్యే ఖర్చు కూడా తక్కువే. కాబట్టి ప్రతిరోజూ నానబెట్టిన కిస్‌మిస్‌లు, కుంకుమపువ్వు రేకులను తినడం అలవాటు చేసుకోవాలి. కొన్ని రోజులకే మీలో మార్పు మీకే తెలుస్తుంది.

తదుపరి వ్యాసం